భాగ్యనగరం

భాగ్య నగరం 

అది నిజంగా భాగ్యనగరమే
పట్టా పుచ్చుకుని పట్నం చేరిన 
తమ్ములను చెల్లెళ్లను
కార్పొరేట్ ఏసీ గదుల్లో
మెదడుకు మేత పెట్టి 
జేబులు నింపి
అన్నపూర్ణలా ఆదరిస్తోంది.
అక్షయపాత్రలా ఆహ్వానిస్తోంది.

వారాంతపు సెలవుల్లో
ఊరికి దూరంగా ఉండి ఉర్రూతలూగిస్తున్న
రామోజీ ఫిలిం సిటీ చూపిస్తుంది.

నాలుగు స్తంభాల నగిషి చూపించి
నవాబు గారి గొప్పతనాన్ని గుర్తుచేసి
చౌడి బజార్ అంతా తిప్పి చంటి దానికి 
గాజులు కొనిపిస్తుంది.

ఆ భాగ్యమతి నగరానికి
నిజంగా ఆ ప్రదేశం ఎంతో సుందరం
భాగ్యనగరవాసులు కట్టుకున్న
బంగారు సరస్సు హుస్సేన్ సాగరo

అందాల సరస్సులో ఎగిసిపడే కెరటాలు
యువ ప్రేమికులకి ఉత్సాహాన్ని,
మధ్యలో ఉన్న గౌతమ్ బుద్ధుడు
వయసు మళ్ళిన వాళ్లకి జ్ఞానోదయాన్ని,
కలిగించే అందమైన ప్రదేశం.

పేరుకే పాత నగరం
నేటి తరం వారు కట్టలేని కట్టడాలు
మచ్చుకి నిజాం నవాబు గారి 
చౌమహల్లా ప్యాలెస్.
చూడగానే ఆహా అనిపిస్తుంది 
మదిని దోచేస్తుంది

బొమ్మలంటే పిల్లలు ఇష్టపడతారు
పెద్దలకు కూడా ఇష్టమే పైకి చెప్పరు
బొమ్మలు తోటి విన్యాసాలు
వండర్లన్నీ చూపించే wonderland

రెక్కలున్న విమానమే గాల్లో ఎగురుతుంటే
ఆశ్చర్యంగా పైకి చూస్తారు
రెక్కలు లేని మనిషి గాల్లోకి ఎగరడం చూడాలంటే
 Gravity zip చూడవలసిందే.

కోహినూరు వజ్రం పుట్టిన ప్రదేశం చూడాలంటే
గోల్కొండ కోట ఎక్కాల్సిందే.
భాగ్యనగర వాసులకు నిజంగా ఆ కోట ఒక భాగ్యమే.

ఎవరికి తెలుసు ముచ్చింతల్ చింతలు తీర్చే
 ప్రదేశంగా మారుతుందని
ఒక చిన్న జీయర్ కు తప్ప
ఉదయిస్తున్న సూరీడులా
రామానుజుడు భాగ్యనగరవాసుల్ని పులకరింప చేస్తున్నాడు.

సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్న
 Thrill city అన్ని వయసుల వారికి
వినోదం పంచుతుంది.
విహారయాత్ర స్థలమై కూర్చుంది.

మాదాపూర్ లోని శిల్పారామం
మహదానందాన్ని ఇస్తుంది.
కళాకారుల పనితనం
పనిగట్టుకుని చూడవలసిందే.

 కైలాసంలో శివుడు వెండికొండపై ఉంటాడు
భాగ్యనగరపు బాలాజీ పాలకొండపై ఉంటాడు
నౌబత్ పహాడ్ భాగ్యనగరం నలుదిక్కులను చూపిస్తుంది.

ఈ sarai కట్టిన షరాబు ఎవరో
చేతులెత్తి మొక్కాల్సిందే
Taramati baradari విజిట్ చేయవలసిందే

పారే సెలయేరుని చూస్తే అందరికి ఇష్టమే
నగరం నడిబొడ్డులో ఏకంగా నీటి పార్కులే కట్టేశారు
జలవిహార o పేరుతో మందిని మురిపిస్తున్నారు.
Snow parklu. సెల్ఫీ మ్యూజియంలు
ఏమి చెప్పను భాగ్యనగరం వాసుల అదృష్టం.

మూసీ నది మురికి కంపు తెచ్చిన
ఒడ్డు పక్కన మ్యూజియం పెట్టుకుని
భారతదేశానికే పేరు తెచ్చింది.
సాయిబు గారి అభిరుచి అంతా
భద్రంగా గదుల్లో దాచుకుంది.
సాలార్జంగ్ గారు మీ అభిరుచికి జోహార్లు.

చిట్టెలుక దగ్గర నుంచి పంజా విసిరే పులి వరకు
అడవిని అంతా అందాల బోనులో పెట్టి చూపిస్తుంది
నెహ్రూ జూలాజికల్ పార్క్.

నవాబుల అభిరుచికి అందాల భవంతులే కాదు.
కుతుబ్ షాహీ tombs కూడా సాక్ష్యమే

నగరం నడిబొడ్డులో ఉన్న కేబీఆర్ పార్కు
అందం మాటల్లో చెప్పలేను చూడవలసిందే.

బాగా అలసిపోయారు కదూ
అలసిన శరీరానికి విసిగిన మనసుకి
రవంత హాయిని ఇచ్చే ఇరానీ టీ 
ఉస్మానియా బిస్కట్టు లాగిo చేద్దాం పదండి.

  ఆకాశంలో ఉండే నక్షత్రాలను చూడాలంటే
రాత్రి చూస్తేనే కనబడతాయి..
ఈ భవంతిలో పగలు కూడా నక్షత్రాలు కనబడతాయి.

ఆకాశంలోని నక్షత్రాలులా మిలమిల మెరుస్తూ ఉంటాయి
పాల మీగడ రంగులో ఉంటాయి
పండు వెన్నెలను గుర్తుకు తెస్తాయి
ఇది ఊహ కాదు నిజమే
ఆ మంచి ముత్యాలను చూస్తే
 ప్రతి ఒక్కరి మదిలో మెదిలే నిజం.

ఆడ దాని చేతికి అందం గాజులు.
సౌభాగ్యానికి గుర్తు గాజులు.
చంటి దాని దిష్టికి నల్ల గాజులు
పెళ్లికూతురు చేతికి పలు రకాల గాజులు
అతివలందరి మనసు దోచే గాజులన్నీ
షాపులు కాదు గాజుల కర్మాగారాలే
ఉన్నచోటు లాడ్ బజార్.
పక్కనే చార్మినార్.

భాగ్యనగరానికి మరొక భాగ్యం
దుర్గమ్మ చెరువు వారధి.

భాగ్యనగర వాసులకి మరొక హరితవనం.
బొటానికల్ గార్డెన్.
అడవంతా నగరానికి వచ్చేసింది.

రుచులు కోరుకునే నాలుకకి 
హైదరాబాదు బిర్యాని మరొక కొత్త రుచి.
మధ్యలో గోకుల్ చాట్ మర్చిపోయాం.
మరిచిపోలేదు సాయంత్రం తినొచ్చు

ప్రతిరోజు నగరం మధ్యలో పరిగెత్తే
మెట్రో రైలు.
విశ్వమంతా తిప్పి తీసుకువచ్చే
విమానాల ఇల్లు
సాంకేతికంగా ఎదిగి ప్రపంచాన్నే 
తనవైపు తిప్పుకుందా నగరం
తమ్ముల్ని చెల్లెల్ని కడుపులో పెట్టి దాచుకుంది
ఆ మహాతల్లి.
పిలిచి మరీ అన్నం పెడుతుంది
యువతరం కళ్ళల్లో సంతోషం నింపుతోంది.

అది నిజంగా భాగ్యనగరమే
అన్నపూర్ణలా ఆదరిస్తుంది
అక్షయపాత్రలా ఆహ్వానిస్తుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట