సత్య
సత్య ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న  సత్యకి  పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరికి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా.  ఒకే పోలిక ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనుకుంటా. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుతున్న రాఘవ మ్మ ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం  గమనించింది. రాఘవ మ్మ ఆ పిల్లల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ ఇంతవరకు అమెరికాలో ఉండేవారని ఇప్పుడు ఇండియా వచ్చేసారని అందుకని తనని తీసుకువెళ్లడానికి వచ్చారని చెబుతూ తనకి అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో అని మనసులో బాధపడుతూ ఒక్కసారి తన గత జీవితం గుర్తుకొచ్చింది సత్యకి "   కంగ్రాట్యులేషన్స్  పార్వతమ్మ గారు మీ అమ్మాయి సత్యకి  కవల పిల్లలు పుట్టారు.  తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్తున్న మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది పిల్లలను చూద్దామని ఎత్తుకుని ముద్దాడాలనిపించింది కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది. కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లలు ఏడుపులు లీలగా వినిపిస్తున్నా ఏమీ చేయలేక పడు...