పరమాత్ముడు
పరమాత్ముడు పప్పు రుబ్బే రుబ్బురోలు పరమాత్ముడిని తలచి షోడశోపచార ములు చేసి పూజలు చేసే ఒక పడతి. ఆ పడతి కి వెఱ్ఱి యని ప్రజలు తలచే పరమాత్ముడు ఎందైన కలడని పోతన చెప్పె. భవన స్తoభము నుండి నరసింహుడు అవతరించి ప్రహ్లాదుని రక్షించే. దశావతారములు ఎత్తి విష్ణువు భక్తులను రక్షించే. రహదారి పక్కన తాడిచెట్టుని అమ్మగా తలచి పసుపు కుంకుమలు పూసే మానవుడు. పుణ్యమని దలచి వే ప కి రావికి కల్యాణం జరిపించే. మూగ జీవిని వెంకటేశ్వరుడని తలచి అచ్చు వేసి రహదారిలోకి విడిచే . వానరం కనపడగానే వంగి వందనము చేసి హనుమగా తలిచే. దీనులలోనే కనబడింది దైవం మదర్ తెరిసా కి మానవసేవే మాధవసేవ అని నమ్మింది రామకృష్ణ పరమహంస. మనసుపెట్టి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఉంది దైవం. ఆ మనసు పేరే మానవత్వం. మనసు మెచ్చే పని చేయడమే మనిషి లక్షణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ 9491792279