తెల్ల జుట్టు
తెల్ల జుట్టు " ఏవండీ మీకు తెల్ల జుట్టు వచ్చేస్తోంది. అప్పుడే మీరు ముసలోళ్ళు అయిపోతున్నారు. నలభై ఐదు ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు రావడం ఏమిటి నాకు ఏదోలా ఉంది అంటూ చెప్పిన భార్య సుమతి మాటలకు వెనుక తిరిగి చూసాడు శంకర్ అద్దం ముందు తల దువ్వుకుంటూ.  వయస్సు పెరుగు తోంది  కదా తెల్ల జుట్టు రాక నల్ల జుట్టు వస్తుంది ఏమిటి?  అయినా ఈ వయసుకి ఈ జుట్టు అందం అంటూ శంకర్  సమాధానం ఇచ్చాడు.  "లేదండి దీనికి ఏదో మార్గం యూట్యూబ్లో చూస్తా. ఈమధ్య తెల్ల జుట్టుకి చాలామంది చిట్కాలు పెడుతున్నారు. ఎన్నో ఆయిల్స్ కూడా వచ్చే యి. ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఒక చిట్కా చెప్పారు. "లేదు అవి ఏమీ నాకు ఇష్టం లేదు అవన్నీ సరిగా పని చేయవు. పైగా ఎలర్జీలు కూడా లేనిపోని పైగా బోల్డు  ఖర్చు కూడా. ఒకసారి రంగు వేసే వదిలేస్తే కుదరదు. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉండాలి. నాకు ఇలాగే బాగుంటుంది అన్న భర్త శంకర్ మాటలు వినిపించుకోకుండా "లేదండి  దీనికి ఏదో ఉపాయం ఆలోచిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది సుమతి. మన నిత్యజీవితంలో ఉన్న సమస్యలు చాలక చాలామందికి తెల్ల జుట్టు సమస్య  పట్టుకుంది. పాపం కొం...