అరిటాకు భోజనం
అరిటాకు భోజనం . విందు భోజనానికి ముఖ్య అతిథి అరిటాకు.ఆకుపచ్చటి అరిటాకు ఆంధ్రుల భోజనానికి అది ట్రేడ్ మార్క్. ఆకాశంలోని హరివిల్లు వలె మెరిసిపోతుంది అరిటాకులోని ఆతిథ్యం. ఆకులోని పదార్థాలు చూడగానే ఆత్మా రాముడికి రెక్కలు వస్తాయి. ఆకుపచ్చటి అరిటాకులో కుడివైపు చివర పసుపు పచ్చటి ముద్దపప్పు మెరిసిపోతూ ఉంటుంది. దాని పక్కనే చెరువులోని కలువ పువ్వుల మెరిసిపోతూ నూనెలో తేలియాడుతున్న ఆవకాయ. ఇంకా కోనసీమ భోజనం అంటే పనసపొట్టు లేకుండా ఎలా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకులో అందంగా కుదురుగా ఉంటుంది . మాకు విందు భోజనంలో కంద బచ్చలి తప్పనిసరి అది లేకపోతే విందు ఏమిటి నా బొంద అంటుంది ఓ ఇల్లాలు. కూరలు దాటికి ముందుకు చెయ్యి చాపితే మచ్చు కోసం వేసిన దప్పలం ,దాని పక్కనే తెల్లగా మెరిసిపోతూ అప్పడం, బాగా వేగిపోయిన గుమ్మిడి వడియం అలా ఎడం పక్కకి ప్రయాణం సాగిస్తే పండు వెన్నెల లాంటి అన్నం, అన్నం దాటుకుని చేయి చాపితే పులిహార పక్కనే పూర్ణం బూర్లు ఇవన్నీ ఆకుని ఆక్రమించుకుని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి . అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆంధ్రుల అభిమాని గోంగూర పచ్చడి అడవులో దున్నపోతులా మెరిసి...