తొలి తిరుపతి
తొలి తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే తిరుపతిని పెద్ద తిరుపతి అంటారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల గ్రామంలో కొలువై ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. మరి తొలి తిరుపతి పేరు ఎప్పుడైనా విన్నారా! ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే చదలవాడ తిరుపతి. ఇక్కడ శృంగార వల్లభ స్వామి దేవాలయం అతి పురాతనమైనది. ఈ దేవాలయంలో తొలిసారిగా మహావిష్ణువు శృంగార వల్లభ స్వామి రూపంలో కనబడడం వలన ఇది తొలి తిరుపతిగా ప్రసిద్ధి కెక్కింది. భక్తుడు ఎంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తులో దేవుడు కూడా కనిపిస్తాడని ఒక నమ్మకం. ఇక్కడ స్వామి నవ్వుతూ కనిపిస్తాడు. కాకినాడ జిల్లాలో ఉండే దేవాలయంలో చూడదగిన ఆలయం. ఈ ఆలయానికి అతి సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ సామర్లకోట రైల్వే జంక్షన్. సామర్లకోట రైల్వే జంక్షన్ లో దిగి ఆటోలో ప్రయాణించి ఆ దేవాలయం చేరుకోవచ్చు నేను కేవలం దేవాలయం యొక్క ప్రాముఖ్యతని అది ఎక్కడ ఉందో ఎలా చేరుకోవాలో మాత్రమే తెలియజేస్తున్నాను. మిగతా వివరాలు కి మీరు వెబ్సైట్ చూసుకోవచ్చు. గూగుల్లో ఆలయాలకు సంబంధించిన అన్ని వివరాలు ద...