పోస్ట్‌లు

ఏప్రిల్ 17, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

వాహన భీమా

వాహన భీమా  మీరు కొత్త కారు కొన్నారా? లేక పాత కారుకి బీమా రెన్యువల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గైడ్ మీ కోసమే. కారు బీమా ఎందుకు అవసరం, ఏ రకాలు ఉన్నాయి, ఉత్తమమైన పాలసీ ఎలా ఎంచుకోవాలి అన్నదాని నుంచి క్లెయిమ్ ఎలా చేయాలో వరకు పూర్తిగా తెలుగులో తెలుసుకోండి. వాహన భీమా అంటే ఏమిటి? కారు భీమా అనేది మీ కారుకు జరిగిన ప్రమాదం, దొంగతనము, లేదా ఇతరులకు నష్టం చేసినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించే బీమా పాలసీ. ఇది రోడ్డు ప్రమాదాలలో నుండి ప్రకృతి విపత్తుల వరకూ ఎన్నో అంశాల్లో కవర్ ఇస్తుంది. కారు బీమా రకాలూ: 1. తర్డ్ పార్టీ బీమా (Third-Party Insurance): చట్టపరంగా తప్పనిసరి. మీరు ఇతరుల జీవితాలకు లేదా ఆస్తికి నష్టం చేస్తే, ఆ బాధ్యతను బీమా సంస్థ భరిస్తుంది. మీ కారుకి జరిగిన నష్టం కవర్ కాదు. 2. కాంప్రెహెన్సివ్ బీమా (Comprehensive Insurance): తర్డ్ పార్టీతో పాటు మీ కారుకి జరిగిన నష్టానికీ రక్షణ. ప్రమాదం, అగ్ని, వరద, దొంగతనాలు మొదలైనవి కవర్ అవుతాయి. చాలా మంది యజమానులకు ఇది ఉత్తమ ఎంపిక. అదనపు రైడర్లు (Add-on Covers): Zero Depreciation Cover: భాగాల వయస్సు లెక్కచేయకుండా పూర్తిగా క్లెయిమ్ ఇస్తారు. Engine Protection: ...

సీనియర్ సిటిజెన్

సీనియర్ సిటిజన్ ఒక రోజులో పెద్ద మార్పు నిన్నటి వరకు బాధ్యతలకు బందీని. కాలంతో పరిగెత్తే కర్మజీవిని. ఇప్పుడు గాలిలో ఎగిరే పక్షిని. అప్పుడు ఇప్పుడు  కాలమే నాకు సమస్య. అప్పుడు కాలం సరిపోక  ఇప్పుడు కాలం గడవక. ఇదంతా కొత్త లోకం. ఆ లోకమంతా చూపించి పొద్దు గడిపే నా దోస్త్ వీడే. అందంగా చేతిలోకి చేరిపోయి జేబులోకి దూరిపోయి గోల చేస్తూ తన రాకను తెలియజేస్తాడు. ఆ ఊరి కబురుని పొరుగూరి సొగసుని అందరి క్షేమాన్ని అందంగా చూపిస్తాడు. ముఖ పుస్తకమై మురిపిస్తాడు  తల్లిలా సందేహాలు తీరుస్తాడు. కోరితే కోరాగా చిక్కుముడి విప్పుతాడు. WhatsApp కి సాటి లేదనిపించాడు. రోజు మాట్లాడే బొమ్మలు చూపించి బెంగలు తీర్చుతున్నాడు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. దాని విన్యాసాలన్నీకి ప్రేక్షకుడిగా మార్చి కాలాన్ని గడిపించేస్తాడు. నేను ఒక మాలోకాన్ని. ఆ దోస్త్ గాడి లోకంలో నేను ఒక నిరక్షరా స్యుడిని నేను అక్షరాలు నేర్పిన వాళ్ళకి శిష్యుడునైపోయాను.  కాల ప్రవాహంలో వాళ్ళ వడిలో  పసిపాపను అయిపోతాను. కాలం కన్నెర్ర చేస్తే  పంచభూతాల్లో కలిసిపోతాను నేను ఎవర్ని ఒక సీనియర్ సిటిజన్ని. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బ...

రక్షాబంధన్

రక్షా బంధన్  అమ్మ కడుపుని పంచుకుని నాకంటే ముందుగా పుట్టావు ముందు అడుగు వేసి నాకు మార్గదర్శి అయ్యావు చిటికెన వేలు అందించి ధైర్యాన్ని ఇచ్చావు ఎవరు చూపు పడకుండా నా వెనక కొండలా నిలబడ్డావు ఆటలలో పాటలలో అండగా నిలబడ్డావు నీ గారం తో నేను పసిపాపనయ్యాను అన్న అండగా ఉన్నాడని హాయిగా నిద్రపోయాను. నేను అలిగినప్పుడు నాన్నలా అలకతీర్చావు అమ్మ కోప్పడినప్పుడు నా కన్నీళ్లు తుడిచావు. అన్ని వదులుకొని నేను వెళ్లిపోయినా నాన్న వారసత్వం నిలబెట్టి   అమ్మా నాన్న లాగా నన్ను ఆదరించే అన్నకి తమ్ముడికి నా రక్షాబంధన్.  నేను నీ పక్కనున్నన్నాళ్లు  నాన్న కొట్టినప్పుడు అమ్మ కోప్పడినప్పుడు పెద్ద ఆరిందవలె అడ్డుకునేదాన్ని. కన్నీళ్లు తుడిచే దాన్ని  అమ్మ తాయిలం పెట్టినప్పుడు  రెండు చేతులు చాపే దాన్ని. నేను ఇప్పుడు అమ్మని అయిపోయా  ఎల్లవేళలా నిన్ను కాపాడడానికి ఈ రక్షా కంకణం.  అది నీకు శ్రీరామరక్ష. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

ఆవకాయ

ఆవకాయ  అందమైన అమ్మాయి కళ్ళను చెరువులో పెరిగే కలువ పూలతో పోలుస్తారు. ఈ కలవ పూలు రెండు రకాలు. ఒకటి తెలుపు మరొకటి ఎరుపు. ఈ ఎర్ర కలువ పూలు చూడగానే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. మన వంటింట్లో కుండలో ఉన్న ఆవకాయ కూడా ఎర్రగా నూనెలో తేలుతూ కలువ పువ్వు లాగా నాకు అనిపిస్తుంది. ఆకులో పంచభక్ష పరమాన్నలున్న ఆవకాయ ముక్కలేకపోతే విస్తరి చిన్నబోతుంది. ఆంధ్రుడిగా పుట్టినవాడు ప్రతివాడు ఆవకాయ అంటే చాలా ఇష్టపడతాడు. విదేశాల్లో ఉన్న కోరి మరీ తెప్పించుకుంటాడు.ఆంధ్రుడికి ఆవకాయకి చాలా అవినాభావ సంబంధo వుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సందడి మొదలవుతుంది.కారణం ప్రధానంగా ఆవకాయకి కావలసిన మామిడి కాయలు కాసే కాలం. నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునే కాలం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళని ఎండ పెట్టి నిలువ చేసుకుంటే సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆవకాయ ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. తెలుగు వాడు విస్తరిలోకి ఏమీ లేకపోయినా పెరుగన్నము ,ఆవకాయతో పూట గడిపేసుకుంటాడు. ఇదే విషయం శ్రీనాథ మహాకవి ఆవకాయతోటి తన అనుభవం పద్య రూపంలో చెప్పారు. ఈ విషయం ఒక కవి మిత్రుడు చెప్పాడు నాకు. అంటే ఆవకాయ అతి ప్రాచీనమైందని తెలు...

ఇల్లు

ఇల్లు " అబ్బా రోజు మన చెట్ల మీద వాలి కావు కావు మంటూ అరిచే కాకులు అదేమిటి రెండు రోజుల నుంచి ఎక్కడా కనబడలేదు. గోడ మీద నిన్న పెట్టిన అన్నముద్ద అలాగే ఉంది. ఈవేళ అన్న ముద్ద పెట్టిన ఆకాశంలో ఎక్కడా కాకిజాడ కనపడట్లేదు. మనసేమీ బాగుండట్లేదు. ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చనిపోయిన భవాని శంకర్ గారు ఏదో తీరని కోరికతో పోయారు. అది కోరికో లేకపోతే భయమో ఎవరికి ఏమి చెప్పలేదు. ఆయన పోయి అప్పుడే రెండు రోజులైంది. ఆయనకు తీరని కోరికలు ఏముంటాయి. కడుపుని పుట్టిన ఆరుగురు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి మనవలు కూడా పుట్టేశారు. అందరూ కోటీశ్వరులు కాకపోయినా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆయన మీద ఆధారపడి న వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు భవాని శంకరం గారి భార్య రెండవది మొగుడు వదిలేసిన కూతురు. వాళ్ళిద్దరికీ బతకడానికితగిన ఏర్పాట్లు ముందుగానే చేసేసాడు భవాని శంకర్ గారు. పిల్లలందరూ తండ్రి కార్యక్రమాలన్నీ యధావిధిగానే చేస్తున్నారు. మరి కాకి అన్నo ముద్ద ఎందుకు తీసుకెళ్లడం లేదు ఎవరికీ అర్థం కాని ప్రశ్న అలా ఎవరిలో వాళ్లు బాధపడుతూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు.  అలా పన్నెండు రోజులు గడిచిపోయాయి కానీ ఏనాడు కాకి అన్నం ముద్ద త...

పార్వతీపురం మన్యం జిల్లా విహారయాత్ర

పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక గైడ్: ప్రకృతిని, భక్తిని, సంస్కృతిని అన్వేషించు యాత్ర పరిచయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర క్షేత్రంలో విస్తరించి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా, ప్రకృతి, భక్తి, గిరిజన సంస్కృతులు కలిసిన ఒక అపూర్వమైన ప్రదేశం. ఈ ప్రాంతం చరిత్ర, సంస్కృతి, పుణ్యతతో కూడిన వివిధ విశేషాలను కలిగి ఉంది. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి యాత్ర చేయదలచిన వారికి ఇది ఉత్తమమైన గమ్యం. ఈ జిల్లాకి ప్రధాన కేంద్రం పార్వతిపురం.  విహారయాత్ర స్థలాలు (Must-Visit Tourist Attractions) 1. అరకు లోయ (Araku Valley): జిల్లాకు సమీపంలోని అరకు, ప్రకృతి ప్రేమికుల కోసం ఆదర్శవంతమైన ప్రదేశం. పచ్చటి కొండలు, మబ్బులతో కమ్మిన లోయలు, కాఫీ తోటలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్య ఆకర్షణలు: బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం శ్రేష్ఠ సమయం: అక్టోబర్ – ఫిబ్రవరి 2. మను గంగి నది తీరాలు: శాంతమైన, ప్రకృతి వాతావరణంతో కూడిన ఈ నది ప్రాంతం పిక్నిక్‌కు, ఫొటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశం. 3. కురుపాం రాజ కోట: చరిత్రను ప్రేమించేవారికి మరచిపోలేని అనుభవం ఇస్తుంది. ఈ కోట ఆనాటి రాజవంశ పాలనకు గుర్తుగా నిలుస్తోంద...