పోస్ట్‌లు

పేరు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పేరు

వాడు ఎవరు? సమాధానం ఏం చెబుతాము? వాళ్ల అమ్మా నాన్నల పేరు చెప్పి “వాళ్ల కొడుకు” అంటాము. అక్క పేరు చెప్పి “దాని తమ్ముడు” అంటాము. నిన్న మొన్నటి వరకు అమ్మ కడుపులో విహారం చేసి భూమ్మీదకి వచ్చి మూడు నెలలు అయింది. ఇవాళ్టి నుంచి వాడికో పేరు ఉంది. నిన్నటి వరకు ఏదో నోటికి వచ్చిన ముద్దుపేరుతో వాడిని పిలిచేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. పేరు పెట్టుకున్నాడు కాబట్టి సర్కారు వారు గుర్తింపు పత్రం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముద్దు పేరుతో పిలిస్తే వాళ్ల అమ్మ ఊరుకోదు. ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్న ఈ పేరు నిర్ణయించారు. పేరు నిర్ణయించడానికి ఎన్నో ఆలోచించాలి. ఆకాశంలో మెరిసే తారలను, గతించిపోయిన తరాలను కలుపుకోవాలి. ఇలవేల్పులను, ఇష్టదైవాలను మర్చిపోకూడదు. చివరలో ఎవరు పెట్టని పేరు ఉండాలి. అవి కదా నిబంధనలు! ఈ నిబంధనల చట్రంలో గిరగిరా ఎన్నో రాత్రులు తిరిగి అలసిపోయి, ఒక పేరుకు ఓట్లు వేసి, ఆ పేరు మనసులో మననం చేసుకుంటూ ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూశారు వాడి తల్లిదండ్రులు. పేపర్ ఎక్కడా లీక్ అవ్వలేదు. అంత పగడ్బందీగా పబ్లిక్ పరీక్షల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అవును, పేపర్ లీక్ అయితే మజా ఏముంటుంది! పెళ్లి చూపుల్లో...