పోస్ట్‌లు

మాట లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మాట

బుజ్జి పాపాయి పలికింది తొలి పలుకు. ఆదిగురువు కేమో ఒళ్ళంతా పులకరింపు. ఆ చిలుక పలుకు మనకు శ్రవణానందకరం. అది తొలి మాటా కాదు కోకిల పాట. సప్తస్వరాల మూట. కోటి వీణల మోత. అందుకే మనకు శ్రవణానందకరం. మాటే గా బంధాలు పెంచే మూట. అది మానవులందరికీ వరాల మూట. మాటతీరు బాగుంటే లోకమంతా మిత్రులు.. పుల్ల విరుపు మాట అంటే దూరం జరుగు. సుయోధనుడి మాటే కురుక్షేత్ర యుద్ధం. కురు వంశం అంతా పరలోక యానం ధర్మ రాజు గారికి ఏం మిగిలింది నీళ్లు వదలడం తప్పితే.  మాట పదిలంగా వదులు. గాంధీ మాటలకే ఆంగ్లేయులు పలాయనం. సత్య హరిశ్చంద్రుడు కష్టాలన్నీ మాట కోసమే తల్లికి ఇచ్చిన మాట కోసం రాముడు అరణ్యం పాలు.   వేలాది మంది కపివీరులలో హనుమే ఎందుకు   ప్రత్యేకం.   మాట తీరు కపివీరునికు వరం.    సీతాన్వేషణకు హనుమ నియామకం.    అందుకే వారంతా మనకు ప్రత్యేకం.         వాగ్ధాటి అందరూ మెచ్చేది         వాగుడు కాయను ఎవరు మెచ్చరు.        డాక్టర్ గారి మాట రోగికి ఉపశమనం.        కొండంత యేనుగు గోరంత మావటివాడి మాటకే     ...