మాట
బుజ్జి పాపాయి పలికింది తొలి పలుకు.
ఆదిగురువు కేమో ఒళ్ళంతా పులకరింపు.
ఆ చిలుక పలుకు మనకు శ్రవణానందకరం.
అది తొలి మాటా కాదు కోకిల పాట.
సప్తస్వరాల మూట. కోటి వీణల మోత.
అందుకే మనకు శ్రవణానందకరం.
మాటే గా బంధాలు పెంచే మూట.
అది మానవులందరికీ వరాల మూట.
మాటతీరు బాగుంటే లోకమంతా మిత్రులు..
పుల్ల విరుపు మాట అంటే దూరం జరుగు.
సుయోధనుడి మాటే కురుక్షేత్ర యుద్ధం.
కురు వంశం అంతా పరలోక యానం
ధర్మ రాజు గారికి ఏం మిగిలింది
నీళ్లు వదలడం తప్పితే.
మాట పదిలంగా వదులు.
గాంధీ మాటలకే ఆంగ్లేయులు పలాయనం.
సత్య హరిశ్చంద్రుడు కష్టాలన్నీ మాట కోసమే
తల్లికి ఇచ్చిన మాట కోసం రాముడు అరణ్యం పాలు.
వేలాది మంది కపివీరులలో హనుమే ఎందుకు
ప్రత్యేకం.
మాట తీరు కపివీరునికు వరం.
సీతాన్వేషణకు హనుమ నియామకం.
అందుకే వారంతా మనకు ప్రత్యేకం.
వాగ్ధాటి అందరూ మెచ్చేది
వాగుడు కాయను ఎవరు మెచ్చరు.
డాక్టర్ గారి మాట రోగికి ఉపశమనం.
కొండంత యేనుగు గోరంత మావటివాడి మాటకే
వశం.
భర్త మాట కి భార్య పరవశం పెళ్లయిన కొత్తలో.
అమ్మ మాట బిడ్డ శిరోధార్యం.
టీవీ లో చాగంటి వారి మాట మన మనసులకు ఊరట.
నిదానమే ప్రధానం.
చెప్పాల్సింది సూటిగా చెప్పు.
మాట అర్థం కాకపోతే అపోహలకు ఆధారం.
హావభావాలు మాటకి అలంకారం.
చావు కబురు చల్లగా చెప్పు ఓ నానుడి
నవ్వుతూ చెప్పే చావు కబురు నవ్వులపాలు.
పేడ ముఖంతో చెప్పే మంచి మాట మనసుకి
తూటా.
సెల్ ఫోన్ మాట సంక్షిప్తంగా చెప్పు.
చాట భారతం అయితే బిల్లు పేలు.
శత్రు మిత్రులను ఆప్యాయంగా పలకరించు
స్పందన లేకపోతే వాళ్ళ ఖర్మానికి వదులు.
చెప్పకూడని మాట పెదవి దాటనీకు.
పెదవి దాటితే పృథ్వి దాటు.
చెప్పుడు మాటలు చెవిని పెట్టకు.
మాట మనిషినీ నడిపించే యంత్రం.
ముందుకు నడిపించవచ్చు మట్టినీ కరిపించ వచ్చు.
మాటే మంత్రం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి