పోస్ట్‌లు

గురు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గురు దక్షిణ

గురుదక్షిణ సాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేదం బోధిస్తున్న రామకృష్ణ శాస్త్రి గారికి ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఒక చేత్తో సంచి ,మరొక చేత్తో పది సంవత్సరములు ఉన్న కుర్రాడు చెయ్యి పట్టుకుని తన ఇంటి ముందు ఆగడం గమనించాడు. " నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అమలాపురం దగ్గర ఉన్న రంగాపురం. వీడు మా అబ్బాయి నారాయణ శాస్త్రి. వీడు ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇకముందు స్మార్త విద్య నేర్పిద్దామని మా సంకల్పం.. మీ గురించి మా గ్రామంలో ఎవరో చెబితే విని ఎంతో ఆశతో వచ్చాను అంటూ చెప్పు కుంటూ వచ్చాడా పెద్దమనిషి. మీరు నిలబడే ఉన్నారు! . ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ శాస్త్రి గారు ఆ వచ్చిన ఆయనకి అరుగు మీదనున్న చాప చూపించి ఆ తర్వాత అతిధి మర్యాదలు చేసి నాకు విద్య నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పటికే నా దగ్గర ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లంతా రాత్రి అరుగుల మీద పడుకుని మా ఊర్లోను ,పక్క ఊర్లోనే ఉండే బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లల్లో వారం చేసుకుని విద్య నేర్చుకుంటున్నారు. మీకు అందుకు సమ్మతమైతే మీ అబ్బాయికి కూడా అలాగే ఏర్పాటు చేస్తాను.  రేపు మంచి రోజు రేపటి నుంచి విద్...

గురువు

గురువు  ప్రతి మనిషి అమ్మ ఒడిదాటి ఒక వయసు వచ్చిన తర్వాత అడుగుపెట్టేది బతుకు పాఠాలు నేర్పే గుడిలో. అదే మన బడి. చిన్నతనo లో బడికి వెళ్లాలంటే ఒక రకమైన భయం. మనం బడికి వెళ్లకపోతే అమ్మకి భయం. అందుకే బలవంతంగా ఏడుస్తున్నా సరే బరబరా లాక్కుని వెళ్లి బడిలో కూర్చోబెడుతుంది. ఇది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు బాల్యంలో జరిగే అనుభవమే. విద్య విలువ అమ్మకు తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్న బిడ్డలకు తెలియదు. బడి అంటే బ్రతుకు పాఠాలు నేర్పే బొమ్మ. ఓం ప్రధమంగా పలక మీద బలపం తో అక్షరమాల నేర్పించి ఒక్కొక్క తరగతి గది దాటించి బ్రతుకుకి పునాది వేసేవాడు గురువు. గురువు అంటే బాధ్యత గల వ్యక్తి. గురు శిష్యులు అనుబంధం ఎవరు నిర్వచించలేం. ఒక తరగతి లో 30 మంది విద్యార్థులు ఉన్న అందరికి సమాన దృష్టితో విద్య బోధించేవాడు గురువు.   ఆ బడిలో చేరిన పిల్లలందరూ తరగతి గదిలో బెంచీల మీద ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తారు. ఆ రకంగా పిల్లల మధ్య స్నేహ తత్వం పెంచుతారు గురువుగారు. పిల్లల మధ్య అలా మొదలైన స్నేహం కడవరకు సాగుతూ ఉంటుంది. పాఠశాలంటే అన్ని విద్యలు నేర్పే సరస్వతీ మాత గుడి. పద్యాలను రాగయుక్తంగా చదివే తెలుగు మాస్టారు తె...