నిత్య కళ్యాణం
నిత్య కళ్యాణం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు పవిత్ర గోదావరి నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కాకినాడ జిల్లాలోని ఐ పోలవరం మండలంలో ఉన్న మురమళ్ళ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి ఒకటి. ఇది చూడదగిన ప్రదేశం. పార్వతి దేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞవాటికను నాశనం చేయడానికి శివుడి అంశతో పుట్టిన వీరభద్ర స్వామి నీ శాంత పరచడానికి భద్రకాళి అమ్మవారు ఒక కన్య రూపంలో వచ్చి స్వామి వివాహం గాంధర్వ వివాహం చేసుకుంటుంది. ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది. ప్రతినిత్యం పూజలతోపాటు నిత్యం భక్తులకు అన్నదానం ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. పిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతుంటే తల్లిదడ్రులు ఈ స్వామికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే దారిలో ఈ మురమళ్ళ గ్రామం ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.