పోస్ట్‌లు

ఆయుధం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆయుధం

అంశం: ఆయుధం. గుండెల్లో ధైర్యాన్ని పెంచేది రాజ్యాలను రక్షించేది సామ్రాజ్యాలను పెంచేది ఆయుధం. ప్రాణం రక్షించేది ప్రాణం పోగొట్టేది భయం తగ్గించేది భయపెట్టేది ఆయుధం. ఆయుధాలను బట్టి దేవతలను గుర్తించొచ్చు సహస్రనామాలతో కీర్తించవచ్చు. సైనికుడు చేతిలో ఉండేది తుపాకి కర్షకుడు చేతబట్టేది కొడవలి కాలంతో పోటీ పడి ఆయుధం రూపుమార్చు కుంది విషవాయులుగా ప్రాణాలు తీస్తోంది. అణు బాంబులుగా విస్పోటనం చేస్తోంది. పండగ రోజుల్లో పూజలు అందుకునేది ఆయుధమే. ఆయుధం మనిషి జీవన యానంలో అంతర్భాగం. కానే కాదు మనిషిని మనిషి చంపుకుతినే సాధనం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279