మాటలు రాని స్నేహితుడు
అదొక అందమైన సుందర నగరం. ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వాళ్లు, “శేష జీవితం ఇక్కడే గడపాలి రా!” అని అనుకునే వాళ్లు. అంత సౌకర్యవంతమైన నగరం అది. ఆ నగరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో మా నివాసం. అప్పుడు అది అక్కడక్కడ ఇళ్లు ఉన్న ప్రదేశం. అయితే ఇల్లు దూరంగా ఉన్నా ఇరుగుపొరుగు వాళ్లు కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కలవారు. అలాంటి ప్రదేశంలో ఉండడం నాకు భయంగా ఉండేది కాదు. జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మే పెద్ద స్నేహితురాలు. బడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు. ఆ చిన్న చిన్న స్నేహాల్లోనే మన బాల్యం నవ్వుతుంది. కానీ బడి దాటిన తర్వాత కొన్ని స్నేహాలు కనుమరుగైపోతాయి. కాలం గడుస్తుంటే కొందరు దూరమవుతారు. కళాశాల దాకా కూడా కొనసాగే స్నేహాలు మరికొన్ని. అక్కడ కూడా కొత్త స్నేహాలు కలుస్తాయి. అలా జీవిత ప్రయాణంలో స్నేహాలు మారుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోతాయి. అలాంటి ఊర్లో ఆ అపురూపమైన వీధి నుంచి మెయిన్ రోడ్డు వరకు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో నాకు ఒక ముఖ్యమైన స్నేహ...