పోస్ట్‌లు

ఏప్రిల్ 22, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

లేగదూడ

 లేగదూడ  ఆ లంకంత కొంపలో ఒక మూలగా ఉన్న గదిలోంచి "అమ్మా నొప్పులు భరించలేకపోతున్నాను అంటూ గట్టిగా అరుస్తున్న ఆ ఇంటి ఇల్లాలు రాజమ్మ గొంతు వింటుంటే అక్కడ హాల్లో కూర్చున్న అందరికీ మనసులో ఆందోళన పెరిగిపోతోంది. ఉదయం నుంచి ఆ ఇంటి ఇల్ల్లాలు ఒక ప్రాణిని ఈ లోకంలోనికి తీసుకురావడానికి పడుతున్న బాధను చూడలేకపోతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. చంటి పిల్లలు అంటే అందరికీ సరదాయే. కానీ ఆ పిల్లని ఈ లోకంలోకి తీసుకురావడానికి ఆ తల్లి పడే ఆవేదన మరణయాతన ఊహించలేం. రాజమ్మ భర్త రాజారెడ్డి మాటిమాటికి ఆ గది వైపు తొంగి చూస్తూ కాలు గాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు. ఇంతలో చంటి పిల్ల ఏడుపు వినిపించింది. గదిలోంచి మంత్రసాని బయటకు వచ్చి అమ్మాయి పుట్టిందంటూ ఆనందంగా చెప్పింది.  నలుగురు మగ పిల్లల తర్వాత ఆడపిల్ల. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ పాటించడం ఒక పాపంగా భావించే వాళ్ళు. దానికి తోడు రాజారెడ్డికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. రాజారెడ్డి కోరిక ప్రకారం మహాలక్ష్మి పుట్టింది. ఆ దంపతులు ఆనందానికి అవధులు లేవు. అందరూ రాజారెడ్డిని అభినందిస్తుంటే రాజారెడ్డి ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు. ఇంటిదగ్గర సమస్య తీరింది. పొలంలో...

అన్నపూర్ణమ్మ

అన్నపూర్ణమ్మ " చూడు కనకమ్మ రెండో పెళ్లి వాడని ఇంకేమీ ఆలోచించకు. కుర్రవాడు నాలుగు వేదాలు చదివిన పండితుడు. యజ్ఞాలు యాగాలు చేయించడంలో దిట్ట. వయసు గురించి ఆలోచించకు. ఆ ఊర్లో లంకంత కొంప సొంత వ్యవసాయం ఆవులు గేదెలు చెప్పాలంటే వాళ్లకు ఏమీ లోటు లేదు. మొదట మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక కూతురు పుట్టిన తర్వాత చనిపోయింది. కూతురుకి పెళ్లి చేసినప్పటికీ భర్త కూడా పోయాడుట. మేనమామకు ఒక్కతే కూతురు . మేనమామ అతని భార్య ,భర్త పోయిన కూతురు ఈ పెళ్ళికొడుకు దగ్గరే ఉంటారు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకు. మన అన్నపూర్ణమ్మ అన్ని విధాలా తగిన సంబంధం. తండ్రి లేనీ పిల్లలకి సంబంధాలు ఎలా వెతుకుతావ్. నేను నీ మంచి కోరే చెబుతున్నాను అంటూ గబగబా చెప్పేసి కనకమ్మ గారు ఇచ్చిన మంచినీళ్లు తాగేసి వెళ్ళిపోయాడు పెళ్లిళ్ల పేరయ్య నారాయణ శాస్త్రి నారాయణ శాస్త్రి గారు వెళ్లిపోయిన తర్వాత కనకమ్మ గారు ఆలోచన పడింది. తండ్రి లేని పిల్లలు. తగినంత ఆర్థిక స్తోమత కూడా లేదు. వచ్చిన సంబంధం కాదనుకోవడం ఎందుకు అనుకుంటూ తన అంగీకారం తెలియజేసింది. ఆడపిల్ల వారి పరిస్థితి నారాయణ శాస్త్రి గారి ద్వారా విని పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తామని...

ఎవరి తప్పు లేదు

ఎవరి తప్పులేదు " ఇదేమిటి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒక పెద్ద పెను తుఫాన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వయసులో దీన్ని తట్టుకునేది ఎలా? ఈ ఆఖరి దశలో ఎవరు చూస్తారు. ఎవరు ఆదరణగా ఇంత ముద్ద పెడతారు. బాధ్యతలు అన్నీ అయిపోయాయి కదా. ఏదో కృష్ణ రామా అనుకుంటూ తీర్థయాత్రలకు వెళ్లి హాయిగా కాలక్షేపం చేద్దామనుకుంటే ఇలా హఠాత్తుగా వసుమతి మరణించడం నిజంగా తట్టుకోలేక పోతున్నాను అంటూ మంచం మీద పడుకుని పెద్దగా ఏడుస్తున్నాడు జగన్నాథ శర్మ.  చూసే వాళ్ళందరికీ ఆ దృశ్యం హృదయవిదారకంగా ఉంది. నిజమే ఈ వయసులో భార్య చనిపోతే మగవాడికి చాలా కష్టం  భార్య తోడు లేకుండా ఒక క్షణం కూడా గడవదు మగవాడికి  ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా లేచి భర్త కోసం ఆ గుప్పెడు మెతుకులు భార్య వండి పెడితేనే ఆ మగవాడికి తృప్తి అనుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు తుడుచుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.  జగన్నాథ్ శర్మ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఆరుగురు ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసి పురుళ్ళు పుణ్యాలు అన్ని పూర్తి చేసి సొంత ఊర్లో సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేద్దామని పట్నం నుంచి ఈ మధ్యనే ఆ ఊరికి వచ్చాడు...

కాకినాడ జిల్లా విహారయాత్ర

ఒకప్పుడు కాకినాడ ముఖ్య పట్టణంగా ఉండే  తూ ర్పుగోదావరి జిల్లా 2022 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారము కాకినాడ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాగా విడిపోయింది.  కాకినాడ జిల్లాకి తూర్పున బంగాళాఖాత తీర ప్రాంతం, ఉత్తరాన అనకాపల్లి జిల్లా , దక్షిణాన కోనసీమ జిల్లా, పడమర తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి  ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు పిల్ల కాలువలు గోదావరి తీర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతి.  ఇంక   కాకినాడ జిల్లాలో చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు  ఒక్కొక్కటి చూద్దాం.. అన్నవరం:  రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. స్వామివారి ప్రసాదం అత్యంత మహిమాన్వితం. మళ్లీ మళ్లీ తినాలనిపించే అమృతం.  తలుపులమ్మ లోవ:  తుని పట్టణానికి దగ్గరగా ఉండే ఈ తలుపులమ్మ లోవ  మరొక పుణ్యక్షేత్రం. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుక్కున్నవారు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు.  పిఠాపురం: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురూహుతికా దేవి.  కుక్కుటేశ్వర స్వ...