సోషల్ మీడియా బంధాలు
అంశం :సోషల్ మీడియా బంధాలు నేటి బంధాలకు – డిజిటల్ స్క్రీన్‌లే వేదికలు. మాటల్లో మాధుర్యం తగ్గింది, ఇమోజీల లాలిత్యమే మిగిలింది. లైకు పెడితే ప్రేమేనా? కామెంట్ రాలేకపోతే విరోధమా? వాట్సాప్ స్టేటస్‌లలో దాగిన పిలుపులు, కాల్ చేయకుండానే "బిజీ!" అనుకునే మనసులు. ఒకప్పుడు బంధాల బీజంగా మొలిచిన స్నేహాలు – ఇప్పుడు నెట్‌వర్క్ పరిచయాల్లో కలిసిపోయాయి. బంధం ఒక ట్యాగ్ అయింది, ప్రేమ ఒక హ్యాష్. ఫొటోలకు ఫిల్టర్లు, నవ్వులకు స్టిక్కర్లు, కానీ మనసుకు మాత్రం మాస్క్ తొలగించలేము. విష్‌లు ఫార్వర్డ్ చేస్తాం – దూర మిత్రునికి, కానీ పక్కనుండే వారిని పలకరించకుండా వెళ్తాం. గడియారం ముందుకు పరుగెడుతుంది, బంధాలు మాత్రం వెనక్కి జారిపోతున్నాయి. వాస్తవ ప్రేమకు వెబ్ అడ్రెస్ అడిగే కాలం ఇది, కన్నీళ్లు కూడా ఇప్పుడు సింక్ అవ్వాలి! ఓ మిత్రమా! స్క్రీన్‌ను కాసేపు పక్కన పెట్టు, నన్ను చూడు – నేను ఈ డిస్‌ప్లే కంటే లోతైనవాడిని. బంధం నెమ్మదిగా నడవాలి – చేతులు పట్టుకుని, ఫాలోలు కావు, పక్కనుండే నీడ కావాలి. ఓర్పు, ఆసక్తి, ఆత్మీయత – ఇవే నిజమైన కనెక్టివిటీ, సిగ్నల్స్ కంటే మనసులే శాశ్వతమైన నెట్‌వర్క్. నువ్వు పక్కనుంటే – నోటిఫికేష...