కబ్జా
కబ్జా " చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. మూడు బెడ్ రూములు హాలు, కిచెన్ ,డైనింగ్ హాలు ,రెండు బాల్కనీలు, రెండు బాత్రూములు మనకి శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్ తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందిట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియా కు దగ్గర్లో మెట్రో స్టేషన్ కూడా వస్తుంది ట. బిల్డర్ కూడా చాలా మంచి వాడ నీ పైన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ఈరోజు మార్కెట్ రేట్లు ని బట్టి ఆ రేటు ఏమి ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పని చేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలుకి ఆలోచనలో పడ్డాడు రామారావు. రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు.చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతుంటాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్లకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్ళు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటివరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొన లేకపోతే, మరికొన్ని ఆ ప్...