పోస్ట్‌లు

జులై 19, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పండుగ

అబ్బా ! మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాముఅంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్ లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ "చూడండి నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది.   జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి చూశారు. ఏం సమాధానం చెప్పాలని.  ఆడపిల్లలు మనవలని ఎత్తిన భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి చిన్నది ఫోన్లు పెట్టేసారు. జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి ఇద్దరేసి పిల్లలు పుట్టారు.  ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. "అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు వస్తారుట...

బొమ్మ కావాలి

సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది. ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే. బ్రతుకు బండి నడవాలంటే మూడు వందల అరవై ఐదురోజులు ఆ తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య.  ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు  తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపోతుంది నరసమ్మ కి. అందుకే ఉదయం నుంచి ఏదో సాకు చెబుత...

విశాఖపట్నం ఇసుక కొండ

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య పట్టణాల్లో సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నం ఒకటి. ఇక్కడ అనేక పరిశ్రమలు , అందమైన బంగాళాఖాతం ఒడ్డున అందంగా తీర్చిదిద్దబడిన బీచ్, కనకమహాలక్ష్మి గుడి, పార్కులు, దగ్గరలో ఉన్న సింహాచలం, చూడకుండా ఈ ఊరు వెళ్ళిన వారు ఎవరు ఉండరు. విశాఖపట్నంలో చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న ఇసుక కొండమీద వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. సాధారణంగా సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం గుర్తుకొస్తుంది. అయితే ఇసుక కొండమీద ఈ దేవాలయం నిర్మించి 200 సంవత్సరములు అయింది. ఇక్కడ స్వామి కూడా అత్యంత మహిమాన్వితుడు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఇక్కడ స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ కోరికలు తీర్చుకుంటారు భక్తజనులు. ఐదు పౌర్ణములు వరుసగా స్వామిని దర్శించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంటారు. అందమైన విశాఖ నగరానికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. చూడవలసిన ప్రదేశం.