నన్ను వదిలి ఉండగలవా
"నన్ను వదిలి ఉండగలవా! మనమందరం ఎలాగా బందీ అయిపోయాము. బందీ అయిపోయామంటున్నారు. దేనికో చెప్పకుండా సందేహం పెంచారు. సాధారణంగా బందీలు అనే మాట వ్యసనానికి సరిపోతుంది. నిజమే నాకు కూడా ఒక సందేహం .ఇది వ్యసనమా కాదా. అవునని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదని చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కడో జపాన్లో పుట్టి జగమంతా వ్యాపించింది. అది లేకపోతే మనకు జరుగుబాటు లేకుండా ఉంది. మనం అత్యధికంగా ప్రేమించే వస్తువుల్లో ఇది కూడా జేరిపోయింది. ఎక్కడో మూలగా నడవలో బల్ల మీద కూర్చుని సమాచారాన్ని మోసుకొచ్చే ఆ యంత్రాన్ని పడగొట్టేసి సాంకేతికంగా ఎదిగిపోయి చిన్న బొమ్మగా చేతిలో చేరిపోయి సమాచారాన్ని ఇట్టే మోసుకొస్తోంది, తీసుకుపోతోంది. సమాచారంతోపాటు మన సరదాలు కూడా తీరుస్తోంది. సమయం చెబుతోంది. పది పైసలు ఖర్చు లేకుండా మన ప్రతిబింబాలన్నీ క్షణాల్లో చూపిస్తోంది. ఆ బుజ్జిముండ మీద మీకు ఎందుకు అంత కోపం? రోజు మీ బంధువుల స్నేహితుల పిల్లల క్షేమ సమాచారం తీసుకొస్తోంది కదా అని సమర్థించే వాళ్ళు ఇది వ్యసనం కాదని ఓటేశారు. ఇంకా అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇది లేకపోతే ఒక క్షణం విడిచి ఉండలేని పరిస్థితి. కనపడకపోతే ...