పోస్ట్‌లు

ఏప్రిల్ 1, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

చల్లని తల్లి

చల్లని తల్లి ఇన్నాళ్లు గజగజలాడించిన హేమంతం  కోపంగా చూస్తున్న శిశిరాన్ని చూసి కరిగి పోయె  ముసుగు తన్నిన దుప్పటి మూలకు చేరిపోయే  నిప్పులు కక్కుతూ భానుడు చెమట పుట్టించే  గది గోడల మీద అందమైన  బొమ్మలన్నీ మాయమయ్యే  వేసవి బాధకి శీతలయంత్రం  ఇంటి గోడల మీద బొమ్మ అయ్యే.  మూడు రెక్కల గాలి పంకా మీద  మోజు తీరిపోయే. మీట నొక్కితే మాట వినే  చల్లని తల్లి అపురూపమాయే  పగలు రాత్రి మరిచి గదికి బందీ అయ్యే   కుటుంబం.  బిల్లు చూసి సంసారి గుండె గుబిల్లుమనే. వేలు పోసి కొన్న దానికేసి వెర్రి చూపులు చూసే సంసారి చిల్లు పడిన జేబుకోసం బడ్జెట్లోని లోటు కోసం  తల్లడిల్లిపోయే ఆ సంసారి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

అయినవిల్లి గణపతి

అయినవిల్లి గణపతి  భక్తుడనై నారికేళము సమర్పింప  తొండముతో కష్టములను తరిమినావు.  రమణీయ కావ్యము రాసిన కరములతో కలములు ఇచ్చి మా కన్నుల పంటను ఆశీర్వదించినావు. గరికతో పూజించిన మా కన్నీటిగాధలన్ని విని  గడ్డి పోచ వలె తేలిక చేసినావు మా మనసులని దొరికిన పత్రితో సేవింప సంతృప్తి చెంది  దయ చూపినావు మా బతుకుల మీద గణనాయకుడవై జగతికి శోభవై గోదావరి తీర గజానను డ వై వెలసి అయినవిల్లి జనుల ఆరాధ్య దైవమై మొక్కుబడి గణపతిగా విఖ్యాతి కెక్కినావు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

గాలి దుమ్ము

గాలి దుమ్ము ఆకాశం మొహం మాడ్చుకుంది ఎప్పుడు హుషారుగా తిరిగే మేఘాలు నల్ల రంగు వేసుకుని చిన్నపిల్లలాగా దెబ్బలాడుకని అలసిపోయి చెమటలు  కార్చాయి. మేఘాల అల్లరికి విసిగిపోయిన సూరీడు చల్లదనం కోరుకుంటే ఏకంగా వాయుదేవుడు విజృంభించి గాలి దుమారం లేపాడు అందంగా పెంచుకున్న తరువుల బాహువులను నిర్దాక్షిణ్యంగా విరిచేసాడు. నీరు పోసిన వాడే నేలపాలు చేశాడు. మధుర ఫలాలు అన్ని దిష్టి చుక్క తగిలించుకుని బేరగాళ్ల కోసం ఆశగా చూసాయి. రైతు కళ్ళల్లో దుమ్ము కొట్టి వాయుదేవుడు మళ్లీ కనిపించని దేవుడు అయిపోయాడు. తట్టలోని మాలు తరగక సర్కారు వారి చెత్త కుండీ దారి వెతికాడు రైతన్న గూడులో ఉండే బుడతడకి గుమ్మం దగ్గర కాపు కాసే షావుకారుకి ఆశగా చూసే ఇల్లాలికి జవాబు చెప్పవలసిన ఈ గరీబు నవాబు అయ్యేది ఎప్పుడో కలికాలంలో నవ్వుతూ ఉండేది ఎప్పుడో  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు Kaakinda 9491792279

నవ్వు

నవ్వు  మనసులోని ఆనందానికి బాహ్య సంకేతం నవ్వు. జీవoలేని నవ్వుకు అర్ధం గుండె గదిలోని గుబులు. మనసు లోని ఆనందం వరదలై పొంగితే బిగ్గరగా నవ్వు. ఒడిలోని బిడ్డ పెదవులపై వచ్చేది బోసి నవ్వు వడ్డికాసుల వాడి నవ్వు చిద్విలాసం. ఆకతాయి వాడి పెదవులపై వెకిలి నవ్వు ఆదరించేవాడు మనస్ఫూర్తిగా నవ్వు. ముదిత సిగ్గుతో తలదించుకుని ముసి ముసిగా నవ్వు. పులిస్టాప్ లేని నవ్వు మనలో లేని వాడి నవ్వు. మత్తు ఎక్కువై వచ్చే నవ్వు పేరు లేని నవ్వు. అసురుల పెదవులపై వచ్చేది వికృతమైన నవ్వు. అభయం ఇచ్చేది దేవతల నవ్వు. ముఖం మీద చెరగని చిరునవ్వు అతిథికి ఆహ్వానం ఫోటోలకు ఇచ్చే ఫోజులు మనిషికి పెంచును ఆరోగ్యo ఆనందం ఎక్కువైతే కళ్ళు కూడా తన భాషలో నవ్వుతాయి. నగుమోముకి చందమామ లాంటి అందాన్ని తీసుకొస్తాయి నవ్వు తనువుకు మంచి మిత్రువు సమయం సందర్భం లేని నవ్వు సమస్యలకు నెలవు. పెదవులపై వచ్చే చిరునవ్వు సమస్య దూరంగా జరుగు. నవ్వుతూ ఆదరిస్తే జగమంతా దరి చేరు.  మూడుముక్కలాటకి అందమైన లోగిళ్ళు  భూతల స్వర్గంగా మందు బాబుల క్లబ్బులు  ఆ నందనవనంలో నవ్వులే పువ్వులు అవుతాయి. అదే లాఫర్స్ క్లబ్. నవ్వు ప్రాణం ఉన్న మనిషికి మాత్రమే దేవుడిచ్...

సహనం

 సహనం  సాయంత్రం ఎనిమిది గంటలు అయింది .  కార్తీక్ ఇంకా రావట్లేదు ఏమిటి.   ఈపాటికి రోజువచ్చేసేవాడు ఏమైంది అబ్బా అనుకుంటూ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడి కోసం కాలుకాలిన పిల్లిలా గేటు దగ్గర నుంచి ఇంట్లోకి తిరుగుతోంది రమ.  ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఏమైంది  అబ్బా అని ఆందోళన పడుతూ అరుగు మీద కూర్చుంది.   ఇంతలో చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. ఏదో   తెలియని నెంబరు అయినా ఫోన్ తీసిన వెంటనే హలో అని     వినిపించింది కార్తీక్ గొంతు. ఏరా ఇంకా కాలేజ్ నుంచి రాలేదు   అంటూ గట్టిగా అరిచింది రమ. లేదమ్మా ఇవాళ కాలేజీలో      క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి అని చెప్పాను కదా  నువ్వు మర్చిపోతున్నావు ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత అంటూ అమ్మ నీకో గుడ్ న్యూస్ నేను జెపి మార్గాన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. సంవత్సరానికి 20లక్షల ప్యాకేజీ అని ఆనందంగా చెప్పాడు కార్తీక్. ఒక్కసారి గుండెల్లో దుఃఖం పొంగు కొచ్చింది రమకి. ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు. తమ కష్టాలు గట్టెక్కపోతున్నాయి అంటూ ఆనందంగా దేవుడి పటoముందు రెండ...

నిజమైన బొమ్మల బంధం

నిజమైన బొమ్మల బంధం  " అమ్మా సీత కొంచెం మంచి నీళ్లు పట్టుకురా !అoటు గదిలోంచి తల్లి వసంత వేసిన కేక విని ఒక చేతిలో మంచినీళ్లు గ్లాస్ తో, మరొక చేతిలో చంటి బిడ్డతో అడుగుపెట్టింది సీత. మంచం మీద పడుకునీ ఉన్న తల్లిని రెండు చేతులతోటి లేవనెత్తి మంచినీళ్లు గ్లాసు నోటి దగ్గర పెట్టి కొద్ది కొద్దిగా తల్లికి తాగించడం మొదలు పెట్టింది సీత.  మంచం మీద పడుకుని తల్లిని చూసినప్పుడల్లా గుండె తరుక్కు పోతుంది సీతకి. ఎలా ఉండే అమ్మ ఎలా అయిపోయింది? ఎనిమిది మంది పిల్లలు. తెల్లారి లేస్తే ఊపిరి కూడా పీల్చుకోవడానికి ఖాళీ లేకుండా ఉండేది. పాపం ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఏదో ఒక పని తోటి సతమతం అవుతూ ఉండేది . పిల్లల చదువు పెళ్లిళ్లు పురుడు పుణ్యాలు అన్ని అయ్యేసరికి భర్త చనిపోవడం అనారోగ్యంతో ఇదిగో ఇలా మంచం మీద పడడం అన్నీ జరిగిపోయాయి. వసంత ఎనిమిది మంది సంతానంలో అందరికంటే పెద్దది సీత. అప్పటి రోజుల్లో చిన్నతనాల్లో పెళ్లి చేసేవారు కాబట్టి వసంతకి పదహారు సంవత్సరాలకే సీత పుట్టింది. అందుకే తల్లి పిల్లల్ని పెంచడానికి పడ్డ కష్టాలు గురించి అన్ని సీతకి తెలుసు.  ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం తండ్రి అంతగా సంపాదనపరుడు కా...