పోస్ట్‌లు

ఆగస్టు 21, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆమె స్వరo _ ఊరికి వరం

"ఏమ్మా మల్లి, ఇంత ఆలస్యమైంది?" అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను." "నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా?" అని అడిగాడు రామారెడ్డి. ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని, పాకలో ఉన్న పశువుని, పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు వేస్తూ వస్తోంది మల్లి. "ఏమ్మా, ఎప్పుడు ఆ పాటలేనా? తొందరగా రా! ఆకలేస్తుంది," అంటూ కేకలేశాడు రామారెడ్డి. చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు మల్లి. ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్లింటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. "ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో!" చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి, నవరాత్రి ఉత్సవాల పందిళ్లలోనూ, శ్రీరామనవమి, శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది. "ఇవి ఎక్కడ న...