పోస్ట్‌లు

ఏప్రిల్ 26, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

బాపట్ల జిల్లా విహారయాత్ర

బాపట్ల జిల్లా విహారయాత్ర |  బాపట్ల — ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికత కోరుకునే వారికి, చారిత్రక ప్రదేశాలను చుట్టే వారికి ఒక అద్భుత గమ్యం! సముద్రతీరపు అందాలు సూర్యలంక బీచ్ బాపట్ల నుంచి కొద్దిపాటి ప్రయాణమే. స్వచ్ఛమైన తీరప్రాంతం, మృదువైన అలలు, ప్రశాంత వాతావరణం... ఒకరోజు విహారానికి సరైన ప్రదేశం. హరిథా రిసార్ట్ లాంటి మంచి వసతులు కూడా ఉన్నాయి. వోడరేవు బీచ్ చిన్న కిరణాలాంటి పల్లటూరి వాతావరణం, తక్కువ జనసంచారం, నిసర్గంతో మమేకమయ్యే అందమైన బీచ్. రామాపురం బీచ్ శుభ్రమైన బీచ్, ప్రశాంతత కోరుకునే వారికి పరిపూర్ణ గమ్యం. ఆధ్యాత్మికత & చరిత్ర పయనం భావనారాయణ స్వామి ఆలయం చోళ రాజుల చరిత్రను మోసుకుంటూ వచ్చేది. ఆలయం శాంతియుతంగా, భక్తి పరవశాన్ని కలిగించేలా ఉంటుంది. మొటుపల్లి పురాతన పోర్టు ప్రాచీన మత్స్యకార గ్రామం. బౌద్ధ స్థలాలు, పురాతన ఆలయాల మధ్య మునిగిపోయే అనుభూతి. జిల్లెల్లమూడి అమ్మ ఆలయం "అమ్మ" అనే పేరుతో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ పసందైన మౌనం, ఆత్మశాంతిని ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకం ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం వలస పక్షుల సందడి మధ్య ప్రకృతితో మమేకం కావాలని ఉందా...

గుంటూరు జిల్లా యాత్ర

గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యాత్రా క్షేత్రాల సమాహారం. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు చెందిన అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. 🛕 హిందూ యాత్రా క్షేత్రాలు 1. అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాచీన నగరం, అమరేశ్వర స్వామి ఆలయం మరియు బౌద్ధ స్థూపంతో ప్రసిద్ధి చెందింది. ఇది శైవ, బౌద్ధ సంప్రదాయాలకు ముఖ్య కేంద్రం. 2. మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడినది మరియు దాని 11 అంతస్తుల గాలిగోపురం ప్రసిద్ధి చెందింది. ఇది నరసింహ స్వామికి అంకితమైన మూడు ఆలయాలలో ఒకటి. 3. కోటప్పకొండ త్రికూట పర్వతం మీద ఉన్న ఈ శివాలయం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. 4. పొన్నూరు భవానారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం తన భారీ హనుమాన్ మరియు గరుడ విగ్రహాలతో ప్రసిద్ధి చెందింది. 5. చే బ్రోలు ఈ గ్రామం అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న చతుర్ముఖ బ్రహ్మాలయం భారతదేశంలో అరుదైన బ్రహ్మ దేవాలయాలలో ఒకటి. 🪷 బౌద్ధ యాత్రా క్షేత్రాలు 1. అమరావతి బౌద్ధ స్థూపం ఈ స్థూపం 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మరియు బౌద్ధ కళా సంపదకు ప్రసిద్ధి. 2. నాగార్జునకొండ నల్లమల పర్వత శ...

ఎవరు మార్చగలరు

ఎవరు మార్చగలరు. కథ కోసం ఆలోచిస్తూ కూర్చున్నా చుట్టూ ఉండే ప్రకృతి పరికించి చూసా కుటుంబ వ్యవస్థలోకి తొంగి చూసా సమాజాన్ని పలకరించా అవి అప్పటికే పేజీలకు కథలన్నీ చెప్పేసాయి. మంచి మూడ్ కోసం లొకేషన్ వెతికా అది ఊటీ యో కొడైకెనాల్లో కాదు  అది కర్మ కాలితే చేరే ప్రదేశం నేను కధ ల కోసం వెళ్ళా అది దుర్భేద్యమైన కోట కోటలో రాజులు రాణులు ఉండరు. అందరూ దొరల బిడ్డల్లా ఉన్నారు ఆవేశంలోనూ ,ఆలోచన లేకుండా బ్రతికేందుకు వేరే మార్గం లేక చేసిన పనికి చట్టం వారికి ఓ గుర్తింపు ఇచ్చింది. ఇనప చువ్వల గదిలో బందీ చేసింది ఏ ఇనప చువ్వను లాఠీ తో కొట్టిన ఒక కథకు జన్మనిస్తోంది. రాయితో కట్టిన గదులన్నీ కన్నీటితో చమరుస్తున్నాయి. ఎన్ని వేల కథల విందో ఆ గది ఎప్పుడు ఆ గది గుండెలో తడి ఆరదు. రో జు కన్నీళ్ళ కథలు విని విని అలవాటైపోయిన చట్టం గుండె ఎన్నో ఏళ్లు బందీలుగానే ఉంచేసి చట్టం తను కల్పించిన అవకాశాన్ని మరచిపోతే  బందీల బ్రతుకులన్నీ ఆ ఇనుప చువ్వల గదిలోనే గాంధీ జయంతి ఎప్పుడు వస్తుందని ఆ శుభవార్త కోసం ఎదురు చూసే ఆ కళ్ళు మధ్యలోనే మూసుకుపోయిన వైనo బిగుసుపోయిన ఆ చేతులు ములాఖత్ గది వైపు  చూపించిన దృశ్యం చూస్తూ ఉంట...

కన్న తల్లి

కనిపెంచిన అమ్మను కడ దశలో కార్పొరేట్ స్థాయి కాకపోయినా కరుణతో చూడవలె గాని  పశువుల శాలకు అంకితం విజ్ఞులకు ఇది విధితమా విశ్వేశ్వరా ప్రాణం పణంగా పెట్టి నవమాసాలు మోసి తన రక్తమే చనుబాలుగా మార్చి బాలారిష్టాలు దాటించి మనిషిగా పెంచి మమతలు పెంచి మంచిని నేర్పిన కన్నతల్లి కి ఇన్ని ఇక్కట్లా మహేశ్వరా. అంతరిక్షంలో ఎగిరిన మనిషికి జ్ఞానం శూన్యం. అజ్ఞానాంధకారంలో మనిషి గమనం. మాతృదేవోభవ అని వల్లించడానికే పెదవులు. ఆప్యాయంగా కన్నతల్లిని ఇంటిలోనికి  ఆహ్వానించడానికి రావు చేతులు. కడ దశలో ఉన్న అమ్మను గడప దాటించడం  ఎవరు నేర్పారు మానవునికి ఈ సంస్కారం. చిత్రము చూడగానే చూపరులకు తీయని బాధ అనుభవించే కన్నతల్లి భాధ నీకే తెలుసు.  మనిషికి విజ్ఞత నేర్పే బాధ్యత నీదే సర్వేశ్వరా. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.            కాకినాడ.9491792279

దానం

 కళ్ళు మూస్తే మరణం. మట్టిలో మట్టి అవుతున్న శరీరం మానవ జీవితం లిప్తకాలం . అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది . అవయవ దానo అన్నదానo కన్న మిన్న. నీ మరణం మరో ప్రాణానికి పునర్జన్మo.    అదే అవయవ దాన పరమార్థం.  టెక్నాలజీ మనకు ఇచ్చిన గొప్ప వరం.  వైద్యో నారాయణ హరి అంటారు అపర నారాయణుడే అవయవదాత. నిన్ను పుట్టించిన బ్రహ్మ కనబడడు. గుళ్లో కాగడా పెట్టి వెతికినా దొరకడు. నువ్వుఅవయవ దానం చేసిన అపర బ్రహ్మవి      కర్ణుడే వేస్తాడు పెద్ద పీట చరిత్రలో.        ఎందుకు ఈ శరీరం మీద మమకారం.          కన్ను మూస్తే మరుక్షణం మరుభూమి పయనం.           బ్రతికినంత కాలo స్వార్ధపు కోరల్లో.          చచ్చిన తర్వాత కూడా పునర్జన్మ కోసం ఎందుకు         తాపత్రయం          మనిషి జన్మకి ఉండాలి సార్ధకత.         ప్రాణం పోయడమే పారమార్ధికత.      మనిషి తయారు చేసిన మైనపు వత్తి నీకు ఆదర్శం.     లోకానికి వెలుగు చూపడ...