రహదారి🛣️
ఆ ఊరినీ ఈఊరినీ కలిపే దారి. బంధాలు పెంచి అనుబంధాలు కలిపి బంధుత్వాలు పెంచేది రహదారి. వీధి వ్యాపారులకు బ్రతుకు దారి. ఆశలు ఆశయాలుతీర్చేది రహదారి. బతుకు గమ్యం చేర్చేది రహదారి. ఇల్లేమో ఇంద్ర భవనం రహదారంతా కంపు మయం. పంతులుగారి పూజ నిర్మాల్యం, రెడ్డి గారు రాత్రి తిన్న బిర్యానీ ముక్కలు., రాజు గారి ఇంటి నుండి కోడి పలావు ముక్కలు తెల్లారేసరికల్లా చెత్తకుప్పలలో జుయ్యీ మంటూ ఈగలు దోమలు. వీధి పశువుల, కుక్కల ,కొట్లాటలు. కర్రతో వాటిని అదిలిస్తూ పాత పేపర్లు వాడు. ఎవరి బ్రతుకు పోరాటం వారిది. ఆసుపత్రి, పరిశ్రమల చెత్త వాటిని కెలుకుతున్న పందులు. ప్రతీ వీధిలో తెల్లవారేసరికి ఇదే చిత్రం. రవి వర్మ చిత్రం కాదు . రహదారి మీద వేసిన చెత్త చిత్రం. సీజన్లో డెంగ్యూ జ్వరాలు. నరాలు వంగిపోయిన జనం. వణికిస్తున్న చలి జ్వరాలు. ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు. సీజన్ సీజన్ కి రకరకాల అనుభవాలు. చేదు అనుభవాలైనా మారని జనం. పరిశుభ్రత గాంధీజీ లక్ష్యం వీధిలో ఉన్న గాంధీబొమ్మ ని కూడా వదలని జనం. బొమ్మ చుట్టూ ఉండే గచ్చు అం...