పోస్ట్‌లు

అతిథి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆనాటి అతిధి

ఆ జీవన విధానం వేరు. ఆ తరం పద్ధతులు వేరు. ఆ ఆప్యాయతలు వేరు. అనుబంధాలు వేరు. తరం మారుతున్న కొద్దీ ఆ అతిధి మర్యాదలు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముందు రిక్షా ఆగిందంటే, రిక్షాలోంచి దిగుతున్న అతిధిని చూసి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పేవారు. “రండి రండి” అంటూ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అప్పట్లో సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజులు కావు. సమాచారం కొరకు ఉత్తరాల మీద ఆధారపడి ఉండేవారు. మరీ ముఖ్య అవసరాల కోసం టెలిగ్రామ్. ఉత్తరం రాస్తే నాలుగు రోజులు కానీ వచ్చేది కాదు. అతిధి చెప్పా పెట్టకుండా వచ్చిన — “ఏదో పని ఉండి ఊర్లోకి వచ్చాను, మిమ్మల్ని చూసి పోదామని రావడం జరిగిందంటూ” — తన ముందస్తు కబురు చెప్పకుండా వచ్చినందుకు సంజాయిషీ చెప్పుకునేవాడు అతిధి. అతిధి తన దగ్గర బంధువు కావచ్చు, లేదంటే దూరపు బంధువు, లేదంటే స్నేహితుడు అయినా ఒకే రకమైన ఆహ్వానం. అతిధి మర్యాదలో భాగంగా ముందుగా గుమ్మo ల్లోనే ఒక బకెట్‌తో నీళ్లు, చెంబు రెడీగా ఉండేవి. పల్లెటూర్లో అప్పటి జీవన విధానానికి అనుకూలంగా ఇళ్లు ఉండేవి కాబట్టి ఆ రకమైన సౌకర్యం కల్పించగలిగేవారు. వచ్చిన అతిధి సరాసరి ఇంట్లోకి వచ్చేయకుండా, కాళ్లు కడుక్కుని రావడం ఒక ఆరోగ్యకరమైన అలవా...

అతిథి

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ   అతిధికి కూడా తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి దేవుడితో సమానం అని చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు? ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం.  మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన్ని కానీ స్నేహితులను కానీ ...