పోస్ట్‌లు

ఏప్రిల్ 3, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

దీపావళి అతిధి

అతిథి  వెలుగులు చిమ్ముతూ రివ్వున ఆకాశానికి ఎగిరి ఆనందం మనకు మిగిల్చి   గాల్లోనేతనువు చాలిస్తుంది ఓ తారాజువ్వ. ఆనంద యాత్రకి ఆఖరి యాత్రకి తప్పకుండా హాజరయ్యే అతిధి. పనికిరాని పేక ముక్కతో ప్రాణం పోసుకున్న   నీనామ మే మానవాళికి పెద్ద అలంకారము.   ఆకాశంలో ఉండే తారలన్నీ పండగకి అతిథిగా వచ్చి మంచి ముత్యాలన్నీ మనకిచ్చి మసి భూమికి అంటించి. వెలుగులు చిమ్మి క్షణం లో చేరిపోతాయి దివికి. ఎవరు కనిపెట్టారో ఈ మతాబు కితాబు ఇవ్వకుండా ఎలా ఉండగలం. గుండెల్లో దాచుకున్న వెలుగులన్నీ దీపాల పండక్కి అందరికి పంచి ఇచ్చి తన గుండెకు చిచ్చు రగిలించుకుని గుండె బద్దలై ప్రజల గుండెల్లో  చిచ్చుబుడ్డిగా మిగిలిపోయింది. చిటపటలాడుతూ వెలుగు విరజిమ్మే పువ్వొత్తులు  వెలిగించాయి బుడ్డి దాని కళ్ళల్లో ఒత్తులు లేని దీపాలు. అరుగుల మీద పండుగకి వరుసగా కూర్చుని  అమావాస్యపు చీకట్లను పారదోలి అజ్ఞానం తొలగించి పండగకి తన పేరు పెట్టుకుని వెలుగు పంచే ధన్యజీవి దీపం. దీపం లక్ష్మికి ప్రతిరూపం ఈ పండగ దీపాల పండగ. సతి తో పాటు పతి కూడా పండక్కి అతిథిగా వచ్చి విష్ణు చక్రం మై వెలుగులు పంచి సద్దుమణిగిన తర్వాత...

ఆయుధం

అంశం: ఆయుధం. గుండెల్లో ధైర్యాన్ని పెంచేది రాజ్యాలను రక్షించేది సామ్రాజ్యాలను పెంచేది ఆయుధం. ప్రాణం రక్షించేది ప్రాణం పోగొట్టేది భయం తగ్గించేది భయపెట్టేది ఆయుధం. ఆయుధాలను బట్టి దేవతలను గుర్తించొచ్చు సహస్రనామాలతో కీర్తించవచ్చు. సైనికుడు చేతిలో ఉండేది తుపాకి కర్షకుడు చేతబట్టేది కొడవలి కాలంతో పోటీ పడి ఆయుధం రూపుమార్చు కుంది విషవాయులుగా ప్రాణాలు తీస్తోంది. అణు బాంబులుగా విస్పోటనం చేస్తోంది. పండగ రోజుల్లో పూజలు అందుకునేది ఆయుధమే. ఆయుధం మనిషి జీవన యానంలో అంతర్భాగం. కానే కాదు మనిషిని మనిషి చంపుకుతినే సాధనం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279

మలి సంధ్య

మలి సంధ్య   నాడు నేను నీకు నవమాసాలు కని పెంచిన బిడ్డని నవనాడులు కుంగిపోయి నేడు నీవు నాకు అయ్యావు బిడ్డగా. పురిటినొప్పులు లేని దేవుడిచ్చిన పసిబిడ్డవి.    నీది పేగుబంధం        నాది మాతృ రుణం.   నాకు అమ్మవే నిన్ను పసిబిడ్డలా మార్చింది కాలం.        నీ కాలంలో నువ్వే నా కలల రాణివి.        ఇప్పుడు మనిద్దరి శరీరాలు ఒక్కటే        ఇంటి పేరు వేరు.         అమ్మా నా చిన్నతనం గుర్తు వస్తోందా నీకు    చెల్లి నీచంకలో,     నీ కొంగు పట్టుకుని నేను   ఇప్పుడు నా చంటిది చంకలో ,   నీమంచం పక్కన నేను పసితనంలో ఆనందంగా నువ్వు చేయించే స్నానం నేను నీకు ప్రతిరోజు చేస్తున్నాను కన్నీళ్లుతో అభిషేకం  అమ్మ ఎందుకిలా మారింది అని.. అగరుతో గుండ్రంగా నుదుటిన బొట్టు పెట్టి మురిసిపోయే అమ్మకి చుక్కలు లేని ఆకాశంలా ఉండే నుదురు మీద రవ్వంత విభూది బొట్టు. తలుపు చాటు వెళ్లి నేను వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం.  అది చూసిన నా ఓదార్పుకు సహకరించలేని నీ శరీరం నా చ...

మాట

బుజ్జి పాపాయి పలికింది తొలి పలుకు. ఆదిగురువు కేమో ఒళ్ళంతా పులకరింపు. ఆ చిలుక పలుకు మనకు శ్రవణానందకరం. అది తొలి మాటా కాదు కోకిల పాట. సప్తస్వరాల మూట. కోటి వీణల మోత. అందుకే మనకు శ్రవణానందకరం. మాటే గా బంధాలు పెంచే మూట. అది మానవులందరికీ వరాల మూట. మాటతీరు బాగుంటే లోకమంతా మిత్రులు.. పుల్ల విరుపు మాట అంటే దూరం జరుగు. సుయోధనుడి మాటే కురుక్షేత్ర యుద్ధం. కురు వంశం అంతా పరలోక యానం ధర్మ రాజు గారికి ఏం మిగిలింది నీళ్లు వదలడం తప్పితే.  మాట పదిలంగా వదులు. గాంధీ మాటలకే ఆంగ్లేయులు పలాయనం. సత్య హరిశ్చంద్రుడు కష్టాలన్నీ మాట కోసమే తల్లికి ఇచ్చిన మాట కోసం రాముడు అరణ్యం పాలు.   వేలాది మంది కపివీరులలో హనుమే ఎందుకు   ప్రత్యేకం.   మాట తీరు కపివీరునికు వరం.    సీతాన్వేషణకు హనుమ నియామకం.    అందుకే వారంతా మనకు ప్రత్యేకం.         వాగ్ధాటి అందరూ మెచ్చేది         వాగుడు కాయను ఎవరు మెచ్చరు.        డాక్టర్ గారి మాట రోగికి ఉపశమనం.        కొండంత యేనుగు గోరంత మావటివాడి మాటకే     ...

సాయి

దైవమే మానవ రూపం షిరిడి సాయి దివ్య రూపం. ఈశ్వర రూపమే సాయి. ఆ నామమే మనకు సహాయి. నింబ వృక్షమే ఆధారం . ముక్కంటి మూలం అనితర సాధ్యం. సాయే సదా మనకు రక్షణం . తిరగలి త్రిప్పడమే మనకు తెలుసు. దాని అంతరార్థం సాయికి తెలుసు. పిడికిళ్ళు బిగించి పిడిని పట్టుకో. జ్ఞానం పెంపొందించుకో. అదేసాయి తత్వం. తిరగలి జన్మ ,చరిత్ర లో చిరస్మరణీయం. హేమాడ్ పంత్ గ్రంథమే సాయి సచ్చరిత్ర. అదే మన భక్త కోటికి. నిత్య పారాయణo. సాయి ఆశీస్సులు సచ్చరిత్రకు ఆధారం. చాంద్ పాటిల్ తో షిరిడీ ప్రయాణం. మహల్సాపతి చే సాయి గా నామ కరణం. సాయి రాకతో షిరిడి గ్రామం ప్రముఖ పుణ్య క్షేత్రం. షిరిడి లోనే ప్రయాగ దర్శనం. దాసగణు మహారాజు కి అది వరం . గోధుమ పిండితో కలరా దూరం అదే సాయి చేతి మహత్యం. సాయి అంటే మన పక్కనే ఉన్నట్లుగా ఓయి అంటాడు. సబకా మాలిక్ ఏక్ అంటూ సమత మమత చాటాడు. మన పాపాలన్నీ ధునిలో మంటల పరం. విభూది ప్రసాదం మనకు వరం. సన్యాసికి చిహ్నం సాయి. పాత మసీదు తన నివాసం. ద్వారకామయి గా మసీదుకు నామకరణం కుల మతాలు లేవు ఉన్నది నలుగురితో పంచుకోవడం. అదే సాయి మనకు నేర్పిన మానవతావాదం. ముప్పొద్దులా ఇచ్చే సాయిహారతి.  మన నయనాలకు వరం . మానవజన్మ తరింప...

శివ

శివ ఏడాదికో మారు హుస్సేన్ సాగర్ లో వినాయకుడు మూడు మునకలు వేసి భాగ్యనగర  వాసులకి ముక్తిని ఇస్తాడు. కాపురం బాలేని ఒక చెల్లి ఉద్యోగం రాలేదని ఒక తమ్ముడు బ్రతుకు బాలేదని ఒక సంసారి దిక్కు తోచక ఒకడు దిక్కు లేక మరొకడు పచ్చటి బ్రతుకుని ఆ సాగరంలో కలిపేసినప్పుడు ఊపిరాడకు మరో లోకం చూసినప్పుడు నేనున్నానంటూ తన బ్రతుకు చూసుకోకుండా సాగరంలో  మూడుమునకలేసి ఊపిరి ఉన్న వాళ్ళని  ఊపిరి లేని వాళ్ళని కన్నవాళ్ళకి  కట్టుకున్న వాళ్ళకి కడసారి చూపు అందించే మరో  అపర వినాయకుడు ఈ భాగ్యనగర జీవి. నామధేయం శివ ఆ సాగరతీరమే అతని అడ్డా జనాలకు ప్రాణహితుడు. రక్షక  భటులకు కుడి భుజం. భాగ్యనగరంలోని ఓ బడుగు జీవి బ్రతకడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన త్యాగజీవి. కొన ఊపిరి ఉన్న వాళ్లు సంతోషంగాను ఈ లోకంలో లేని వాళ్ళ బంధుజనం కన్నీళ్ళతోను ఇచ్చే పదో పరకో  అదే జీవనాధారం. ఉపకారం అంటేనే పారిపోయే జనం ఉన్న రోజులు పరుల ప్రాణం కోసం ప్రాణం త్యాగం చేసే పరమాత్ముడు సార్ధక  నామధేయుడు. భర్త అడుగుజాడల్లోనే భార్య ఆడ ప్రాణం  ఆమె వంతు ప్రాణ రక్షణ పంచుకున్నారు చెరి సగం. సమయానుకూలంగా స్పందించడమే వారి వృత్తి ధర్మం....

రహదారి🛣️

ఆ ఊరినీ ఈఊరినీ కలిపే దారి. బంధాలు పెంచి అనుబంధాలు కలిపి బంధుత్వాలు పెంచేది రహదారి. వీధి వ్యాపారులకు బ్రతుకు దారి. ఆశలు ఆశయాలుతీర్చేది రహదారి. బతుకు గమ్యం చేర్చేది రహదారి. ఇల్లేమో ఇంద్ర భవనం  రహదారంతా కంపు మయం. పంతులుగారి పూజ నిర్మాల్యం, రెడ్డి గారు రాత్రి తిన్న బిర్యానీ ముక్కలు., రాజు గారి ఇంటి నుండి కోడి పలావు ముక్కలు తెల్లారేసరికల్లా చెత్తకుప్పలలో  జుయ్యీ మంటూ ఈగలు దోమలు. వీధి పశువుల, కుక్కల ,కొట్లాటలు. కర్రతో వాటిని అదిలిస్తూ పాత పేపర్లు వాడు. ఎవరి బ్రతుకు పోరాటం వారిది. ఆసుపత్రి, పరిశ్రమల చెత్త వాటిని కెలుకుతున్న పందులు. ప్రతీ వీధిలో తెల్లవారేసరికి ఇదే చిత్రం. రవి వర్మ చిత్రం కాదు .  రహదారి మీద వేసిన చెత్త చిత్రం. సీజన్లో డెంగ్యూ జ్వరాలు.  నరాలు వంగిపోయిన జనం. వణికిస్తున్న చలి జ్వరాలు.  ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు.  సీజన్ సీజన్ కి రకరకాల అనుభవాలు. చేదు అనుభవాలైనా మారని జనం.          పరిశుభ్రత గాంధీజీ లక్ష్యం       వీధిలో ఉన్న గాంధీబొమ్మ ని కూడా వదలని జనం.      బొమ్మ చుట్టూ ఉండే గచ్చు అం...