సాయి
దైవమే మానవ రూపం
షిరిడి సాయి దివ్య రూపం.
ఈశ్వర రూపమే సాయి.
ఆ నామమే మనకు సహాయి.
నింబ వృక్షమే ఆధారం .
ముక్కంటి మూలం అనితర సాధ్యం.
సాయే సదా మనకు రక్షణం .
తిరగలి త్రిప్పడమే మనకు తెలుసు.
దాని అంతరార్థం సాయికి తెలుసు.
పిడికిళ్ళు బిగించి పిడిని పట్టుకో.
జ్ఞానం పెంపొందించుకో. అదేసాయి తత్వం.
తిరగలి జన్మ ,చరిత్ర లో చిరస్మరణీయం.
హేమాడ్ పంత్ గ్రంథమే సాయి సచ్చరిత్ర.
అదే మన భక్త కోటికి. నిత్య పారాయణo.
సాయి ఆశీస్సులు సచ్చరిత్రకు ఆధారం.
చాంద్ పాటిల్ తో షిరిడీ ప్రయాణం.
మహల్సాపతి చే సాయి గా నామ కరణం.
సాయి రాకతో షిరిడి గ్రామం ప్రముఖ పుణ్య క్షేత్రం.
షిరిడి లోనే ప్రయాగ దర్శనం.
దాసగణు మహారాజు కి అది వరం .
గోధుమ పిండితో కలరా దూరం
అదే సాయి చేతి మహత్యం.
సాయి అంటే మన పక్కనే ఉన్నట్లుగా ఓయి అంటాడు.
సబకా మాలిక్ ఏక్ అంటూ సమత మమత చాటాడు.
మన పాపాలన్నీ ధునిలో మంటల పరం.
విభూది ప్రసాదం మనకు వరం.
సన్యాసికి చిహ్నం సాయి.
పాత మసీదు తన నివాసం.
ద్వారకామయి గా మసీదుకు నామకరణం
కుల మతాలు లేవు
ఉన్నది నలుగురితో పంచుకోవడం.
అదే సాయి మనకు నేర్పిన మానవతావాదం.
ముప్పొద్దులా ఇచ్చే సాయిహారతి.
మన నయనాలకు వరం .
మానవజన్మ తరింపునకు అదే ఆధారం.
ప్రేమ కరుణ దానం శాంతి సాయి చెప్పిన మార్గం
అదే మనందరి జీవితాలకు సన్మార్గం.
అపకారికి ఉపకారం శ్రద్ధ సబూరి మనకందరికీ అవసరం.
అడుగడుగునా సాయి ఆలయం
మానవజన్మ తరింపునకు ఆలయ సందర్శనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి