పోస్ట్‌లు

తాతయ్య ప్రేమ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తాతయ్య ప్రేమ

" ఒరేయ్ తమ్ముడు! తాతయ్య చనిపోయాడుట. మావయ్య ఫోన్ చేశాడు అంటూ సరోజ ఫోన్లోనే ఏడుస్తూ పెద్ద తమ్ముడు రవికుమార్ కి ఫోన్ చేసింది. రేపు సాయంకాలం లోపు కార్యక్రమాలన్నీ చేసేస్తారుట.  "అదేమిటి ఇంత అర్ధ రాత్రి వేళ ఫోన్ చేశావు! ఒకసారి చాలా కంగారు పడ్డాను. పార్టీ నుంచి వచ్చేసరికి లేట్ అయింది .ఇప్పుడే పడుకున్నాను. అయినా రేపు నాకు ఆఫీసులో మీటింగ్లు ఉన్నాయి అంటూ సమాధానం ఇచ్చాడు చనిపోయిన పరంధామయ్య గారి కూతురు పెద్ద కొడుకు రవికుమార్. సరోజ ఇంక ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.    సరోజ రెండో తమ్ముడు కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో వాళ్ళకి ఇప్పుడు రాత్రి అవుతుందా! లేదా పగలు అవుతుందా! అని ఆలోచించకుండా ఫోన్ చేసింది సరోజ. " చాలా దురదృష్టం. నీకు తెలుసుగా నాకు ఇప్పుడు వెంటనే రావడం కుదరదు. పిల్లలకు కూడా స్కూలు ఉంది. జూమ్ లో కనెక్ట్ చూస్తే నేను తాతయ్యని చూస్తా! అని తన ప్రేమని ప్రకటించాడు కిరణ్. అయినా అంత దూరం నుంచి ఎలా వస్తాడులే అని సరిపెట్టుకుంది సరోజ. మూడో తమ్ముడు రాజు హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. సరోజి చెప్పిన కబురు విని " నీకు తెలుసుగా గవర్నమెంట్ ఆఫీస...