పూర్వాశ్రమ తల్లి
పూర్వాశ్రమ తల్లి "ఏమండీ! మన కోడలు సీతమ్మ ప్రతిరోజు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటోంది. రెండు మూడు సార్లు పిలిస్తే గాని పలకటం లేదు. అలా వెర్రిదాని లాగా ఆలోచిస్తూ ఉండిపోతోంది. ఏమిటో దాన్ని చూస్తే భయంగా ఉంది," అంది కామాక్షమ్మ తన భర్త రామారావుతో కోడలు గురించి చెబుతూ. "ఎలా ఉంటుంది చెట్టంత కొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడై పిల్లాపాపలతో సంతోషంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఎంతమందికి వస్తుంది అంతటి అదృష్టం! ఇంజనీరు కానీ డాక్టర్ కానీ చదివిద్దాం అనుకున్నాం, కానీ వాడు వేద విద్య నేర్చుకుంటానన్నాడు. సరే అన్నాము. వేద పండితుడై మనకు దగ్గరగా ఉంటాడు అనుకున్నాం. కానీ దైవానుగ్రహం వేరే విధంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థకి అధిపతిగా నిలబెడుతోంది. వచ్చే నెలలోనే సన్యాసాశ్రమ దీక్ష ప్రారంభానికి ముహూర్తం పెట్టారు. అదే సీతమ్మ దిగులు," అన్నాడు సీతమ్మ మావగారు రామారావు. అనంతశర్మ తండ్రి చిన్నప్పుడే చనిపోతే, కోడల్ని మనవడిని తన దగ్గరే ఉంచుకుని చూస్తుంటాడు రామారావు. ఇదంతా దూరం నుంచి వింటున్న సీతమ్మకి ఒక్కసారి గత సంవత్సరం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఉన్నట్టుండి ఆ...