పోస్ట్‌లు

మనిషి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మనిషి

చిత్రం
ఏ బలమైన గాయం ఈ గుండెను తాకిందో తనను తానే మరిచాడు ఈ మనిషి. సమాజపు కట్టుబాట్లను కూడా మరిచాడు ఈ   మానవుడు. చేస్తున్న పని తెలియదు నడుస్తున్న దిక్కు తెలియదు. ధరించిన వస్త్రాల గతి అసలే తెలియదు. మురికి పట్టిన దేహం కంపు తో కూడిన వస్త్రం. కంపు నీటితో తీర్చుకుంటున్నాడు దాహం గతి తప్పిన మతితో ఉన్న మనిషి అతీగతీ చూసేది ఎవరు బాధ్యతగల బంధం బతికి ఉందో లేదో తెలియని వైనం. మేధావులు ఉన్న సమాజానికి ఉంది ఓ బాధ్యత తలో చేయి వేసి ఓ నీడ కల్పిద్దాం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279