పోస్ట్‌లు

అమ్మ @ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ @వినాయక చవితి

అమ్మ @ వినాయక చవితి  అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ప్రపంచంలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గణపతి ఆరాధన తోటే మొదలవుతుంది . ఇది శాస్త్రం చెప్పిన విషయం.సృష్టికర్త అయిన బ్రహ్మకు కానీ సృష్టిని పరిపాలించే ప్రభువు విష్ణుమూర్తికి కానీ సృష్టి స్థితి లయకారుడు ఈశ్వరుడుకి కానీ తొలి పూజ అందుకునే అధికారం లేదు. ముందుగా గణపతి ఆరాధన చేయనిదే ఏ పూజ ప్రారంభించలేము. గణపతి పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడు. గణాలకు అధిపతి. విఘ్నాలను పారద్రోలేవాడు. ఇలా గణపతి గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. భాద్ర పద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంట్లో గణపతి పూజ చేసుకుంటాం. వినాయక చవితి ముఖ్యంగా పిల్లలు పెద్దలు ముదుసలి వారు అనే తారతమ్యం లేకుండా అందరూ చేసుకునే పండగ. మన హిందూ సాంప్రదాయంలో అన్ని వ్రతాలు కుటుంబమంతా కలిసి చేసుకోరు. కొన్ని వ్రతాలు ముఖ్యంగా స్త్రీలకే ఉద్దేశించబడినవి. వినాయక వ్రతానికి అటువంటి తారతమ్యం లేదు. మన ఇంటిలో జరిగే ఏ శుభకార్యామైనా పండుగ అయినా వ్రతమైనా సక్రమంగా నడిపించవలసిన బాధ్యత ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలుదే. ఇంటి యజమానురాలంటే ఇంకెవరు మన అమ్మ లేదా మన భార్య.    పం...