పోస్ట్‌లు

అమ్మ లేని నాన్న లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ లేని నాన్న

అమ్మలేని నాన్న. ఉదయం ఏడు గంటలయింది. ఇంకా కొడుకు కోడలు ఎవరూ లేవలేదు. ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదే సొంత ఊర్లో అయితే ఈపాటికి రెండోసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది. ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది.ఆ లోటు ఏమిటి ఇంతకీ. ఇంకేముంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్టే బేడా సర్దుకుని ఇల్లుకు తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి. రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. ఉదయం 9 గంటలకే ఇద్దరు ఆఫీసుకి పరిగెత్తాలి. ఈలోగానే కోడలు కాఫీ టిఫిన్ వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకుని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఆఫీసులకు వెళ్ళిపోతారు. రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తులో కాపురం ఉంటు న్నాడు. కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఇంట్లో ఏమి తోచట్లేదు. ఎంతసేపని టీవీ చూస్తాడు. ఇక్కడ ఎవరూ తెలియదు. ఏం కాలక్షేపం అవుతుంది పాపం. అయినా తప్పని పరిస్థితి. ఏం చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం. " మావయ్య గారు గుడ్ మార్నింగ్ ...