శ్రీకృష్ణ నిర్యాణం
కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన సాగించడం మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతారం ఎత్తిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులని సంహరించాడు. ఆ దుష్ట శిక్షణ చూసి అనేకమంది మునీశ్వరులు సంతోషించారు. కంసుడు వంటి రాక్షసులను సంహరించి భూభారం తగ్గించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో యాదవ సైన్యం విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులైన యాదవులకు బుద్ధి చెప్పడానికి పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూడ్డానికి విశ్వామిత్రుడు దూర్వాసుడు మొదలగు ఋషులు ద్వారకా నగరానికి వస్తారు. అలా వచ్చిన మునులకు సకల మర్యాదలు చేసి బంగారు ఆసనం పై కూర్చోబెడతాడు. తర్వాత పరమాత్ముని అనేక విధాలుగా స్తుతిస్తూ కొనియాడతారు.అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. మీ పాదపద్మ సందర్శనార్థం వచ్చాం మా కోరిక తీరింది ఇక సెలవు అంటూ ద్వారక సమీపంలోని పిండారకతీర్థం సందర్శించడానికి బయలుదేరుతారు. అక్కడ కొంతమంది యాదవ బాలురు మదమెక్కి శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడికి అ...