పాట
పాట మనసును పరవశింపజేసేది పాట. మనసుకు ఆనందాన్ని ఇచ్చేది పాట. అందమైన పదాలన్నీ రాగబద్ధంగా తాళబద్ధంగా అమర్చడమే పాట. ఒక మొక్కకు విరబూసిన పువ్వులన్నింటినీ దారంలో అందంగా గుచ్చితే ఒక పూలమాలవుతుంది . అలాగే భాషలోని అందమైన పదాలు సన్నివేశానికి తగినట్లుగా వరుసగా అమర్చడమే పాట. అన్నిపూలు దారంతోటే గుచ్చుతారు. కానీ కొన్ని మాలలు మాత్రమే దేవుడి మెడలో చేరుతాయి. అలాగే కొన్ని మాలలు వధూవరులకు అలంకరణగా మారుతాయి. కవి అన్ని పాటలని ప్రసవ వేదన అనుభవించి వ్రాస్తాడు. ఏ పాట ఎవరికీ నచ్చుతుందో ఎవరికి తెలుసు. అమ్మ పాడిన జోల పాటతో బిడ్డ హాయిగా నిద్రపోతుంది ఆ బిడ్డకి రాగం తెలియదు తాళం తెలియదు. కానీ జోల పాట. మార్కులన్నీ కొట్టేసింది .పల్లె జనం పాడుకునే పాటల్లో రాగం తాళం కనపడవు. కానీ ఆ పాట వారి అలసట తీరుస్తుంది. ఆనందంగా పనిచేయిస్తుంది. మనకు కూడా గుండెకు హాయినిస్తుంది. ఒక సన్నివేశానికి తగినట్లుగా వచ్చిన భావావేశమే పాట. అది భక్తి పాట కావచ్చు, విషాద గీతం కావచ్చు, ప్రేమ పాట కావచ్చు దేశభక్తి గీతం కావచ్చు భజన పాట కావచ్చు. భగవంతుడే పాటకు మురిసిపోయి అన్నమయ్య త్యాగయ్య రామదాసు లాంటి మహానుభావులను తనలోనే ఐ...