పాట

పాట సప్తస్వరాల మూట.
మదిని దోచే పూల తోట
మాటల సమాహారం పాట.
రాగం తాళం పాటకి పట్టు.

పల్లవే పాటకి తొలిమెట్టు
చరణం కాకూడదు పాట జారుడు మెట్టు.

జాతీయ గీతం తో తెల్లదొరలు తరలింపు.
విప్లవ గీతంతో మన్యం దొర అదిలింపు.
 దేశభక్తి గేయం తో భరతమాత దాస్య శ్రుoఖం వదిలింపు.
       గేయ మైనా గీతమైనా పాటే కదా.
           పరమార్థం ఒక్కటే.

పరమాత్ముని ప్రార్థించేది కీర్తన
త్యాగయ్య అన్నమయ్య రామదాసు
పురందరదాసులదే ఈ బాట.
పాటలకు వారేగా ఆదిగురువు.
వారి అనుభవాల సారం మనకు భగవన్నామ సంకీర్తన
సంకీర్తన తోటే భగవంతుడు వారికి ప్రత్యక్షం.

ఆది నుండి ఉన్నది అప్పగింతల పాట.
సుద్దులు బుద్ధులు సుదతికి నేర్పేదీ పాట.
ఆడపిల్ల అత్తవారింటికి అందం
పాటతో నడక నేర్పింది పేగుబంధం.
అంతరార్థం తో హత్తుకుపోయింది ఆమె బంధం.

ప్రేయసిని పరవశంగా పలకరించేది ఎంకి పాట
నండూరి వారే దానికి శ్రీకారం. 
ఎంకిపాటగా అందలం.
వెల్లువగా వచ్చిన విమర్శలు దీనికి అలంకారం.

   శ్రమను మరిపించే దే పాట.
  శ్రమజీవుల నోటి నుండి అలవోకగా వచ్చింది కలుపు పాట.
పంట కోతలలో వచ్చే ఆనందం కోతల పాట.
ఏమి చెప్పను పాట అందం. 
పాటేగా మకరందం.

   ఆరుద్రగారు అందంగా చెప్పారు కూనలమ్మ పదం.
   అంత్యప్రాసలు దీనికి మరీ మరీ అందం.
      చదివితే మనసుకు ఆహ్లాదం.

        సంక్రాంతికి అందం గొబ్బిపాటలు.
        తెలంగాణ మకరందం బతుకమ్మ పాటలు.
  
       కాళ్లకు గజ్జెలు చేతిలో తాళపు చెక్కలు
       గురువుని అనుకరించడం చెక్కభజన.
       చెక్కభజన తో భగవన్నామ సంకీర్తనం.
      మన సంస్కృతి సంప్రదాయాలకు చెక్కభజనే అoదం.

      పల్లె నుంచి వచ్చిందే జానపదం.
      అన్నమయ్యకు నచ్చిందే ఆ పదం.

      పాట ఏ వయసు వారికైనా పరవశమే.
       చంటి దానికి లాలి పాటతో నిద్ర వశమే.

చిన్నతనంలో అమ్మ నేర్పిన పిల్లల పాటలు.
 అమ్మాయి అభిరుచికి అదే వేస్తుంది పునాది.
    చిట్టి చిలకమ్మ పాట చిన్నదాని నోట.
    వింటే మన మనస్సు రంజిల్లు నట.

 
సందర్భానుసారం పెళ్లి లో పాడే పాటలు
మగ పెళ్ళివారి మనసుకు అదే రంజకం.
మనసులోని భావం మధురంగా ఆలపించడం
పెళ్లి పాటలు తెలుగు వారికే సొంతం.

పట్టెడు అన్నమే కష్టం.
చెట్టు క్రింద కాపురం.
ట్రాన్సిస్టర్ లో పాట వినడం వాడికి ఆనందం.
అదే వాడి పరవశం.

ప్రతి జన్మ వెనుక తల్లి ప్రసవవేదన.
పాట లోని పదాల కోసం కవికీ వేదన.
సినిమా కవులు ఒకరి తర్వాత ఒకరు.
కవితా లోకం వీడి గంధర్వలోకం వరకు.
ఆ కలం నుండి పుట్టిన పాట అజరామరం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
          కాకినాడ

   

       
      
 
      
       
     
      
   

    

    

     
   
      
     
   
    
     
    
        
       
      
      
    

      

    

.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట