బరువు భాధ్యత
కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది
బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది
ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.
గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి
ప్రయాణం.
ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో
బలమైన బాధ్యత.
బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత.
ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం.
కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం.
మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు
తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo.
అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం
తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల
గమనం.
ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం.
ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం.
ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి