మగువ
మగువేకద మగనకి అండ దండ ఆమెతో జీవితం మగనికి వెండికొండ. వెండికొండ అంతా శివుని పరం పార్వతి మనసంతా శివ మయం. అందుకే జగము మెచ్చే జంట పార్వతీ పరమేశ్వరo. పులి తోలు తప్ప పండుగలకు కూడా పంచ కట్టడు. భస్మం పుట్టిన చోటే భయం లేకుండా ఉంటాడు. నయా పైసా ఖర్చు లేకుండా నందీశ్వరుడే వాహనం. అయినా ఆ మగనిని మెచ్చిందిఈ మగువ. లోకానికే ఆదర్శం అయ్యిందిఈ జంట. శివుడు విల్లునే క్షణంలో విరిచాడు అందాల జానకిని చేపట్టాడు మా సుకుమారుడు అందాల రాముడు. అయినా ఏం లాభం కాపురం అంతా అడవిపాలు. అశోకవనమే ఆమెకు గతి. పతి మాట జవదాటని సుదతి. పుడమి నుంచి పుట్టింది ఈ అయోనిజ. పుట్టింటి నుంచి తెచ్చుకుంది సహనం. సీతమ్మ అంటే మాకు ఆదర్శo. రామనామమే ఆమెకు రమ్యం. కురు వంశం అంతా ఉండే గౌరవ సభ. పతివ్రత కే జరిగింది పరాభవం. ఆమెకు దైవమే చేసింది సహాయం. పంచ భర్తృక అయినా పతివ్రత అయ్యింది. పరమాత్మ మెచ్చిన పడతి. ఇంకేం చెప్పాలి ఈ అమ్మ ఔనత్యం. తొలి సంగ్రామం లోనే ఆంగ్లేయులను తరిమికొట్టింది ఆమె ధీరత్వం. వీరత్వానికి మారుపేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆడ జన్మకు కరుణ జన్మహక్కు. నవమాసాలు మోయకపోయినా అనాధలందరికీ ఆశ్రయo. ప్రపంచ చరిత్ర లోన...