మగువ

మగువేకద మగనకి అండ దండ
ఆమెతో జీవితం మగనికి వెండికొండ.
వెండికొండ అంతా శివుని పరం
పార్వతి మనసంతా శివ మయం.
అందుకే జగము మెచ్చే జంట పార్వతీ పరమేశ్వరo.

పులి తోలు తప్ప పండుగలకు కూడా పంచ కట్టడు.
భస్మం పుట్టిన చోటే భయం లేకుండా ఉంటాడు.
నయా పైసా ఖర్చు లేకుండా నందీశ్వరుడే వాహనం.
అయినా ఆ మగనిని మెచ్చిందిఈ మగువ.
లోకానికే ఆదర్శం అయ్యిందిఈ జంట. 

శివుడు విల్లునే క్షణంలో విరిచాడు
  అందాల జానకిని చేపట్టాడు
మా సుకుమారుడు అందాల రాముడు.
అయినా ఏం లాభం కాపురం అంతా అడవిపాలు.
    అశోకవనమే ఆమెకు గతి.
పతి మాట జవదాటని సుదతి.
పుడమి నుంచి పుట్టింది ఈ అయోనిజ.
పుట్టింటి నుంచి తెచ్చుకుంది సహనం.
సీతమ్మ అంటే మాకు ఆదర్శo.
రామనామమే ఆమెకు రమ్యం.

కురు వంశం అంతా ఉండే గౌరవ సభ.
పతివ్రత కే జరిగింది పరాభవం.
ఆమెకు దైవమే చేసింది సహాయం.
పంచ భర్తృక అయినా పతివ్రత అయ్యింది.
పరమాత్మ మెచ్చిన పడతి.
ఇంకేం చెప్పాలి ఈ అమ్మ ఔనత్యం.

తొలి సంగ్రామం లోనే ఆంగ్లేయులను తరిమికొట్టింది
ఆమె ధీరత్వం.
వీరత్వానికి మారుపేరు ఝాన్సీ లక్ష్మీబాయి.

ఆడ జన్మకు కరుణ జన్మహక్కు.
నవమాసాలు మోయకపోయినా అనాధలందరికీ ఆశ్రయo.
ప్రపంచ చరిత్ర లోనే ప్రసిద్ధం మదర్ థెరిస్సా.

ఉగ్రవాదం గురి పెట్టిన గుళ్ళు ఆమె గుండె చీల్చిన.
పేదల గుండెళ్ళో చిరస్థాయిగా నిలచింది ఇందిరమ్మ.

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ
ఆమె దాతృత్వం మెచ్చింది తెల్ల దొర తనం.
ఆమె కదా మనకు ఆదర్శం నీయం.
ఏమని వర్ణించను ఆమె ఔ దార్యం.

   ఈ పూర్వీకులే మన మహిళలుకు ఆదర్శం.
వారి వారసులు కూడా నిత్యం చేస్తున్నారు శతావధానo.
ఆధునిక మహిళ అలుపు సొలుపు లేకుండా చేస్తోంది
నిత్యం రణం.
     ఊపిరాడని కుటుంబ బాధ్యతలు.
మారాజు మనసున్నవాడైతే చేదోడు వాదోడు.
కాలయముడైన కాలం తోపాటు పయనం.
     ఊహించలేము ఆమె సహనం.

  అన్ని రంగాలలోను ఆమె చేస్తోంది వీరంగం.
   ఏ రంగంలోనైనా ఆమెయే మేడం.
మనమoదరo ఆమెకు చెయ్యాలి సలాం.

        లాలన పాలన ఆమెకే చెల్లు.
పసికందు నుంచి పరమాత్ముడు వరకు 
 కని పెంచింది ఈ తల్లి.
పురిటి నిప్పులు ఆడ జీవికే ప్రత్యేకం.
ఎందుకో ప్రత్యేక కష్టం ఈ జన్మకు.
బిడ్డ చీకిన ప్రతి చనుబాలుచుక్క అమెరక్తం.
గుండెలు తన్నిన గుప్పెడు అన్నం పెడుతూనే ఉంటుంది
మాతృత్వం.

ఏమి చెప్పను ఆ తల్లి గొప్పదనం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ 
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట