పోస్ట్‌లు

కాల లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కాలపరిమితి

కాల పరిమితి గతకాలం మిగిల్చిన చేదు అనుభవం   తలచుకుంటే లాభమెంత? గడచిన ప్రతి క్షణం   కాలపు చెక్కుచెదరని శాసనం వదులుకుంటూ సాగడమే జీవితం   వర్తమానాన్ని ఆనందంగా గడపడమే   మనిషిగా మన కర్తవ్యం ఏ బంధం ఎప్పుడెప్పుడో   ఉరిమే మేఘంలా గర్జిస్తుందో   లేదా పల్లకిలో మోస్తుందో  ఎవ్వరికీ తెలియదు  కాలచక్రం నిలవదు నిను నిన్నలో విడిచిపెట్టి పోతుంది నీవు తిరిగి వెతికినా ఆ గడియలు తిరిగి రావు బంధాలను నమ్మినా కాలం నీవు చూసిన ముఖాల్ని మరుగున పడేస్తుంది కానీ ఆ హృదయంలో వారి నవ్వులు ఇంకా గడియలు మోగిస్తుంటాయి గుర్తులు మిగులుతాయి పలకరింపులు పోతాయి కానీ మనసు మాత్రం పాత జ్ఞాపకాలలో  తేలిపోతూనే ఉంటుంది.