పోస్ట్‌లు

కరోనా నెప్పులు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కరోనా నెప్పులు

కరోనా నెప్పులు. ఆ వార్త విన్న దగ్గర్నుంచి చాలా ఆనందంగా ఉంది. పెళ్లయిన మూడు సంవత్సరాలకి నా చిట్టి తల్లి కడుపు పండింది . ఆనందంతో పాటు మరి కొంచెం గుండెల్లో భయం ఆందోళన కూడా తిష్ట వేసే యి. ఏమి చేయలేని పరిస్థితి. కాసిన్ని పచ్చ కాగితాలుతో జేబు నిండగానే ఇది నా ప్రయోజకత్వమే అని మురిసిపోయి గర్వపడే మానవుడు ఏమీ చేయలేకపోయాడు ఆ పరిస్థితిలో. ఏదో కంటికి కనబడని జీవి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించింది. ఎన్నో ప్రాణాలు తీసుకెళ్లి పోయింది. ఎన్నో సంసారాలు చిన్నా భిన్నం అయిపోయాయి. గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ముక్కు నోరు మూసుకుని ఎవరైనా ఎదురుపడితే పక్కకు తిరిగి పారిపోయే దేశకాల పరిస్థితి. దేశం అంతా అలా ఉంటే నాకు మాత్రం ఆ వార్త ఆనందం కలిగించింది. సరే మొదటి కాన్పు. ఆ పిల్లకి భయం ఆందోళన. దానికి తోడు బయట పరిస్థితి భయంకరం. ఏ భయంకర వార్త ఆమెకు చేరకుండా ఎంత జాగ్రత్త పడిన మొహం లో అయితే ఆందోళన ఎప్పుడు కనిపిస్తూనే ఉండేది.కొన్ని నెలల్లో అమ్మగా ప్రమోషన్ వచ్చే అమ్మాయిని చంటి పిల్లలలాచూసుకోవాలి. మంచి వాతావరణం. మంచి ఆహారం. మంచి వసతి. ఇదే కదా మన పెద్దలు చెప్పిన జాగ్రత్తలు.  బజార్లోకి అడుగుపెట్...