పోస్ట్‌లు

ఒక్క క్షణం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఒక్క క్షణం ఆలోచించండి

కథ పేరు: ఒక్క క్షణం ఆలోచించండి. రచన: మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు.  కాకినాడ 9491792279 " ఏరా ఎలాగైనా సరే అమెరికాలో ఎమ్మెస్ చదవాలి. మా చుట్టాలు పిల్లలు అందరూ అక్కడ చదువుకుంటున్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి కూడా అక్కడే. ఒకసారి నువ్వు సెటిల్ అయిపోతే మాకు బెంగలేదు అంటూ తల్లి , తండ్రి చెప్పిన మాటలకి కొడుకు శరత్ బుర్ర తిరిగిపోయింది.   "లేదు అమ్మా ఇప్పటికే నాన్న ఆఫీసులో పిఎఫ్ అంతా వాడేసారు. బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బీటెక్ చదివించారు. నాకు క్యాంపస్ లో జాబ్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా పోయింది. ఏదో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి కానీ అంత పెద్ద చదువు చదవలే ను అంటూ చెప్పాడు శరత్ "లేదు చదువుతావు.. ఇప్పుడు నువ్వు కనక అమెరికా వెళ్లి చదువుకోకపోతే ఆ పిల్లలందరి ముందు చిన్నతనంగా ఉంటుంది.  వాళ్లందరూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటే నీకు ఇండియాలో యాభై వేలు సంపాదిస్తే మన అప్పులు ఏమి తీరుతాయి. నా పేరు మీద ఉన్న ఈ బిల్డింగ్ ఉంది కదా తాకట్టుపెట్టి చదివిద్దాం .రేపే బ్యాంకు కి వెళ్దాం అంటూ ఖచ్చితంగా చెప్పేసింది శాంత.  "వద్దు మమ్మీ...