పోస్ట్‌లు

మే 22, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

డే కేర్

 డే కేర్  " పార్వతి అమ్మకి నాన్నకి లంచ్ బాక్స్ పెట్టావా! అని అడిగాడు భాస్కర్ తను ఆఫీసుకు తయారవుతూ తన భార్య రాధికని  " పెట్టానండి  ఇద్దరూ స్నానాలు చేసేసి డ్రెస్ మార్చుకుని టిఫిన్ తినేసి మందులు వేసుకుని రెడీగా కూర్చున్నారు అంది రాధిక.     మరి ఇద్దరికీ సాయంకాలం టిఫిన్ కూడా రెడీ చేసావా! అని అడిగాడు భాస్కర్. అన్ని రెడీగా ఉన్నాయి నేను బట్టలు మార్చుకుని వస్తున్నాను ఆఫీస్ దగ్గర దింపేయండి అoది రాధిక రాధిక బట్టలు మార్చుకుని  వచ్చేలోగా  తల్లిని తండ్రిని కార్లో కూర్చోబెట్టి వచ్చాడు భాస్కర్. అందరూ కలిపి బయలుదేరి రామారావు పేట లో ఉన్న ఇంటి ముందు కార్ ఆపి హారన్ కొట్టాడు. ఇంతలో లోపలి నుంచి ఒక  కేర్ టేకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి దంపతులను లోపలికి తీసుకెళ్ళింది. "బై నాన్న  బై అమ్మ అంటూ భాస్కర్ కారులో కూర్చుని రాధిక ని ఆఫీస్ లో  దింపేసి తన ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఇది ప్రతిరోజు జరిగే పని.   భాస్కర్  నారాయణమ్మ రాఘవయ్య దంపతులకు ఏకైక సంతానం.  చిన్నప్పటినుంచి తల్లి తండ్రి అంటే చాలా ప్రేమ భాస్కర్ కి. రాఘవయ్య పల్లెటూర్లో టీచర్ గా పన...

అసాధ్య సాధక స్వామి

 *అసాధ్య సాధక స్వామి* "అసాధ్య సాధక స్వామి  అసాధ్యం తవకిన్ వధ  రామదూత కృపా సింధో మత్ కార్యం సాధయ ప్రభో' " మన జీవితంలో ఏదైనా తలపెట్టిన పని ఏదో ఒక కారణం వలన జరగనప్పుడు, వాయిదా పడుతున్నప్పుడు మనం ఈ శ్లోకంతో స్వామిని ఆరాధిస్తే అసాధ్యమైన పనులు సాధించిన ఆంజనేయ స్వామి మనల్ని కరుణించి పనులు సానుకూలం చేస్తాడని అని పెద్దలు చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం ఎవరు రాసారో నాకు తెలియదు.  అయితే ఆంజనేయస్వామి రామబంటుగా అతి బలవంతుడిగా సీతమ్మ వారి జాడ కనుగొన్న వాడిగా , సముద్రాన్ని అవలీలగా దాటిన వాడిగా, లంక జాడ కనిపెట్టిన వాడిగా మన మనసులో ముద్ర వేసుకొని ఉన్నాడు.   మనకు భయం వేసిన , జ్వరం వచ్చిన , చిన్నప్పుడు అమ్మ ఆంజనేయ స్వామి సింధూరం నుదుటను పెట్టి ఆంజనేయ స్తోత్రం చదివి వినిపించడం మనకు అందరికీ బాల్యంలోనే ఒక అద్భుత అనుభవం.  అప్పటినుంచి మనకి భయం పోగొట్టేవాడుగా ఆంజనేయుడు మన మనసులో ముద్ర వేసుకున్నాడు. దాని తోడు ఆకారం కూడా అలాగే ఉంటుంది. ఆ ఆకారం చూస్తే మనకు సగం భయం తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆంజనేయ ఆరాధన వలన కలిగే ఫలితాలు మనకి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. బాగానే ఉంద...