కొంగు చాటు వీరుడు
కొంగు చాటు వీరుడు ఆ స్వరం వినగానే అందరూ ఆ గదిలోకి పరిగెడతారు. ఏం జరిగిందో అని భయపడిపోతారు. సుశిక్షితులైన సైనికుల్లాగా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చడానికి సన్నద్ధమవుతారు. అక్కడున్నవాడు కండలు తిరిగిన మొనగాడు కాదు. కోడి రామ్మూర్తి గారి శిష్యుడు అసలే కాదు. తీరా చూస్తే పాలకడలిపై శేషతల్పము మీద పడుకున్న శ్రీమహావిష్ణువు కూడా కాదు. నవ మాసాలు ఆ చిమ్మ చీకటిలో ఉండి మన లోకానికి వచ్చిన మహావీరుడు. అమ్మ కడుపులో ఉన్నంతసేపు గిరగిర తిరుగుతూ అమ్మకు పెట్టిన దానిలో వాటా కోరుతూ చక్కిలి గింతలు పెడుతూ ఈ లోకంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అమ్మకు నొప్పి పుట్టించి భూమ్మీదకి వచ్చిన వెంటనే తన ఉనికిని చాటడానికి ఏడుస్తూ బంధువులందరికీ సంతోషాన్ని తెప్పించి నోరు తీపి చేసుకునేలా చేసే చంటి వీడు. వీడు రోజుకో సినిమా చూపిస్తాడు. మన లోకానికి వచ్చిన మహావీరుడు అన్నారు. మరి వాడి వీరత్వం ఏమిటి ఈ లోకంలోకి రాడానికి వాడు చేసే ప్రయత్నమే వీరత్వం. వాడి తాహతకు అది ఎక్కువే. భూమి మీదకు వచ్చిన వెంటనే వాడు మనకు బంధువు అయిపోతాడు. మన అమ్మాయి అమ్మగా మారిపోతుంది. పుట్టిన క్షణం నుంచి వాడు మనకు అతి...