పోస్ట్‌లు

జులై 4, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

వామనావతారం

భూమిక: భారతీయ సనాతన ధర్మంలో దశావతారాలు అనేవి భగవంతుడి పరమ కార్యనిర్వాహణకు ప్రతీకలు. వాటిలో ఐదవది అయిన వామనావతారం ప్రత్యేక స్థానం కలిగినది. ఎందుకంటే ఇది బలికున్న అహంకారాన్ని వినయంతో తలదన్నే అవతారం. ఈ అవతారం ద్వారా విష్ణువు దానం, వినయం, భక్తి, అహంకార నివారణ, ధర్మ స్థాపన అనే అంశాలను ఒకే సంధిలో ప్రతిష్ఠించాడు. పౌరాణిక నేపథ్యం: విష్ణుపురాణం, భాగవతం, వామన పురాణం వంటి గ్రంథాలలో వామనావతారం విశదీకృతంగా వివరించబడింది. బలిచక్రవర్తి మహర్షి ప్రజాపతిగా ప్రసిద్ధుడు. అతడు ప్రహ్లాదుని మనవడు. తపస్సుతో బ్రహ్మదేవుని నుంచి అనేక వరాలు పొంది, త్రిలోకాలను జయించాడు. దేవతలందరినీ ఓడించి, ఇంద్రుని సింహాసనాన్ని దక్కించుకున్నాడు. అతడి ధర్మపరాయణతను హర్షించినా, అతడి లోపల పెరిగిన అహంకారాన్ని చూసి దేవతలు ఆందోళన చెందారు. అదితి దేవి, దేవమాత, తన భర్త కశ్యపునితో కలిసి విష్ణుమూర్తిని పూజించింది. ఆమె తపస్సుతో తృప్తిచెందిన విష్ణువు, ఆమె పుత్రునిగా జన్మిస్తానని వరమిచ్చి, వామన రూపంలో అవతరించాడు. వామనుని యాగశాలలో ప్రవేశం: బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో, వామనుడు బ్రాహ్మణ బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. చిన్నవాడైనా అతన...

మానవత్వం

ఇవాళ పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసానో! ఒక్క బేరం రాలేదు. "పోనీ ఇంటికి వెళ్ళిపోదాం" అనుకుంటే, ఇంటి దగ్గర ఎదురుచూసే అప్పుల వాళ్లకి, ఇంటి యజమానికి ఏం సమాధానం చెప్పాలి! అని పోచయ్య తనలో తాను మధనపడుతూ, ఏం చేయాలో తోచక, ఆటో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ, సందు తిరిగేటప్పటికీ... పెద్ద చప్పుడు, "అమ్మా!" అని గట్టిగా కేక వినబడింది. ఏం జరిగిందో చూసే లోపల చుట్టూ జనం గుమిగూడారు. రోడ్డుమీద సుమారు నలభై ఏళ్ళు ఉంటాయేమో అనిపించే వ్యక్తి, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే మోటార్‌సైకిల్, హెల్మెట్ పడి ఉంది. ఎవరో "యాక్సిడెంట్!" అని గట్టిగా అరుస్తున్నారు. ఒక క్షణం పోచయ్యకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. "ఇదేమిటిరా భగవంతుడా! ఇదొక ప్రాబ్లం. ఈ రోజంతా ఇలా ఉంది ఏంటి? పైసా సంపాదన లేదు, గాని మళ్లీ కొత్త సమస్య వచ్చి పడింది!" "ఇప్పుడు ఆటో దిగితే జనం గట్టిగా కొడతారు, తిడతారు, పోలీస్ కేసు పెడతారు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెడితే జరిగేది అందరికీ తెలుసు. కోర్టులు చుట్టూ తిరగాలి." అని భయపడుతూ తనలో తానే బాధపడుతూ, ఒకసారి రోడ్డు మీదకు చూశాడు. అంతమంది జనం చుట్టూ మూగి ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ ...