మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు
మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు సృష్టిలో తీయనైనది స్నేహం అంటారు. కానీ నా దృష్టిలో అత్యంత మధురమైనది అమ్మతనం. ఈ భూ ప్రపంచంలో అమ్మ జన్మకు మించిన జన్మ లేదు. అమ్మకు సరిసాటి ఏదీ లేదు. మానవ జన్మలోనే కాదు పశుపక్షాదులలో కూడా అమ్మ జన్మ అమృత తుల్యమైనది. ప్రతి స్త్రీకి మాతృత్వం తోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. సహజ సిద్ధంగానే స్త్రీ సహనశీలి. దయామయురాలు. అందుకే బిడ్డలు కనే అధికారం ఆమెకి ఇచ్చాడు దేవుడు. అన్నం పెట్టే అన్నపూర్ణ అంటారు నవమాసాలు కడుపులో దాచుకుని నరకం తాను అనుభవిస్తూ జన్మనిచ్చిన బిడ్డకు అమృతమిస్తూ మలమూత్రాలను రాత్రి పగలు తేడా లేకుండా శుభ్రం చేస్తూ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతూ మాట నేర్పి అక్షరాలు నేర్పి బతుకు నేర్పి బిడ్డ ఎదుగుదలకు తోడ్పడేది అమ్మ. అందుకే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అమ్మ గురించి చెబుతూ నవ మాసాలు కడుపులోనూ మూడేళ్ల వయసు వరకు ఒడిలోనూ తాను బ్రతికున్నంత కాలము బిడ్డను గుండెల్లోనే ఉంచుకునేది అమ్మ అంటారు. గుడిలో ఉండే దేవుడు తన బదులుగా అమ్మని మన ఇంటిలో ఉంచాడంటాడు ఒక మహాకవి. అందుకే మాతృదేవోభవ అని చెప్పింది వేదం అమ్మ గురించి ఇంతకన్నా నిర్వచనం ఏం కావాలి. ఆకాశంలో సుదూర త...