గాలి దుమ్ము
గాలి దుమ్ము ఆకాశం మొహం మాడ్చుకుంది ఎప్పుడు హుషారుగా తిరిగే మేఘాలు నల్ల రంగు వేసుకుని చిన్నపిల్లలాగా దెబ్బలాడుకని అలసిపోయి చెమటలు కార్చాయి. మేఘాల అల్లరికి విసిగిపోయిన సూరీడు చల్లదనం కోరుకుంటే ఏకంగా వాయుదేవుడు విజృంభించి గాలి దుమారం లేపాడు అందంగా పెంచుకున్న తరువుల బాహువులను నిర్దాక్షిణ్యంగా విరిచేసాడు. నీరు పోసిన వాడే నేలపాలు చేశాడు. మధుర ఫలాలు అన్ని దిష్టి చుక్క తగిలించుకుని బేరగాళ్ల కోసం ఆశగా చూసాయి. రైతు కళ్ళల్లో దుమ్ము కొట్టి వాయుదేవుడు మళ్లీ కనిపించని దేవుడు అయిపోయాడు. తట్టలోని మాలు తరగక సర్కారు వారి చెత్త కుండీ దారి వెతికాడు రైతన్న గూడులో ఉండే బుడతడకి గుమ్మం దగ్గర కాపు కాసే షావుకారుకి ఆశగా చూసే ఇల్లాలికి జవాబు చెప్పవలసిన ఈ గరీబు నవాబు అయ్యేది ఎప్పుడో కలికాలంలో నవ్వుతూ ఉండేది ఎప్పుడో రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు Kaakinda 9491792279