పోస్ట్‌లు

రుచి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రుచులు వెనుక జీవితం

రుచులు వెనుక జీవితం " సాయంకాలం వచ్చేటప్పుడు ఉగాది పచ్చడి సరుకులు తీసుకురండి. పొద్దున్నే నేను లేచి పచ్చడి చేసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ సంచి వేసుకుని బజార్ కి వెళ్లి సరుకులు తీసుకొస్తానంటే బాగుండదు అంటూ చెబుతున్న భార్య సుజాత మాటకి ఆఫీసుకు బయలుదేరి పోతున్న రామారావు "సరే తప్పకుండా తీసుకొస్తా! అని గత సంవత్సరం వేప పువ్వు కొనలేదు కదా అన్నాడు. అవును కానీ ఈ ఏడాది ఆ చెట్టు కొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టేశారు అoది సుజాత. ఆఫీస్ నుండి తిరిగి వస్తూ బజారు లోకి వెళ్లిన రామారావుకి మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. ఒకపక్క తట్టలో వేప పువ్వు మరొక పక్క కొత్త బెల్లం కొత్త చింతపండు ఇలా ఉగాది పచ్చడి సరుకులు అన్ని వరుసగా పెట్టుకుని అమ్ముతున్నారు. ఎన్ని షాపులు తిరిగిన వేప పువ్వు అంతా వాడిపోయినట్టుగా ఉంది. అన్ని సరుకులు హై రేట్లు. డిమాండ్ అలా ఉంది. ఏమిటో రాను రాను పండగలకు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సరుకుల రేట్లు మండిపోతున్నాయి అనుకుని సరుకులు అన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు రామారావు  ఇంటికి వచ్చి భార్యకు సరుకులు సంచి అందించి పిల్లలు ఎవరూ లేకపోతే పండగలా లేదు అన్నాడు భార్యతో రామారావు. ఒకరోజు సెలవ...