అతిధి మర్యాద
అతిథి మర్యాద. ************ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ   అతిధికి  కూడా  తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి  దేవుడితో సమానం అని  చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు?  ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా  స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో  మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం.  మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో  వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన...