పోస్ట్‌లు

భజన లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భజన

భజన " శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనo   అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం "  ఇవి వ్యాస మహర్షి చెప్పిన నవవిధ భక్తి మార్గాలు. భగవంతుని చరిత్ర వినడం, భగవంతుని లీలలను కీర్తించడం ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి ముక్తి పొందిన అనేకమంది చరిత్రలు మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.  అలాంటి నవవిధభక్తి మార్గాలలో భగవంతుని లీలలు కీర్తించడం ఒకటి. అనేకమంది భక్తులు రామదాసు అన్నమయ్య త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు వంటి వారు తమ కీర్తనల ద్వారానే భగవంతుని ఆరాధించి ముక్తి పొందారని మనకి చరిత్ర చెబుతోంది. ఈనాటికీ మనం అనేక గ్రామాల్లోనూ పట్టణాలలోనూ దేవాలయాల్లో భజనలు చేయడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పర్వదినాల్లోనూ పండుగలలోనూ ఈ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మా చిన్నతనాల్లో మా గ్రామంలో మా ఇంటిలో కూడా ప్రతి శనివారం భజనలు చేసేవారు.  అసలు భజన అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. పదిమంది ఒకచోట కూర్చుని చేసే భగవన్నామస్మరణ "భజన. భగవంతుని లీలలు తలుచుకుంటూ ప్రార్థించడం భజన. ఇది కూడా భగవంతుని చేరుకునే ...