భాధ్యత
భాద్యత అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ" అమ్మా రమ్య బాత్రూం కి వెళ్ళాలి అంటూ పక్క గదిలోంచి తల్లి పిలుపు వినబడింది. అప్పుడే కునుకు పట్టిన రమ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ లేచి గబగబా పక్క రూములోకి పరిగెత్తింది. చేయవలసిన సహాయం సక్రమంగా చేసి మళ్లీ తన పడక గదిలోకి తిరిగి వస్తుంటే మూడేళ్ల చంటిది ఏడుస్తూ వచ్చింది. దాన్ని ఎత్తుకుని సముదాయించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రమ్య. ఇవేమీ పట్టనట్లు భర్త సురేష్ గురక పెట్టినట్టు నిద్ర పోతున్నాడు. ఈ లోకంలో తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేది అలారం గడియారం ఒకటే. మనం అనుకున్న సమయానికి మనల్ని నిద్ర లేపడం దాని భాధ్యత .మనం లేచే వరకు అది అలా హోరు పెడుతూనే ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మంటలు పెడుతున్న తన భుజస్కందాలపై ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రతి గృహిణి కాలాన్ని చూసుకుని పరిగెట్టాలి. మూడేళ్ల చంటిపిల్ల , ఉదయం టిఫిన్ చేసి క్యారేజీ పట్టుకుని రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే భర్త బాగోగులు, లేవలేని స్థితిలో మంచం మీద ఉన్న కన్నతల్లి. ఏ బాధ్యత అలక్ష్యం చేసేది కాదు. అన్ని బాధ్యతలు రమ్య వైపు చూపులు...