పోస్ట్‌లు

శమంతక మణి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...